Crime News: ఈ రోజుల్లో రోజు రోజుకి నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. పాత కక్షలు, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. శనికి ఆవేశం వల్ల కోపంతో విచక్షణారహితంగా హత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల తీసుకున్న అప్పు తీర్చలేదని వ్యక్తి పై దాడికి పాల్పడ్డ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై టిడిపి నాయకుడు నారా లోకేష్ స్పందించడం వల్ల ఈ విషయం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో వేడిని పుట్టిస్తోంది.
ఈ ఘటనపై టిడిపి నేత నారా లోకేష్ స్పందిస్తూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీద తీవ్ర విమర్శలు చేశారు. ఎల్లప్పుడూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భజన చేస్తూ ఉండే నారాయణస్వామి తన నియోజకవర్గంలో తన కులస్తుల మీద దాడి జరిగినా కూడా పట్టించుకోని స్థితిలో ఉన్నాడని విమర్శలు చేశాడు. ఇదిలా ఉండగా ఈశ్వర్ రెడ్డి మీద పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు.