Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Crime News: కూతురిలా చూసుకోవాల్సిన మేన మామ ఆమె పాలిట కాలయముడయ్యడు..!

Crime News: కొంతమంది మగాళ్లు వారి కామవాంఛ తీర్చుకోవడానికి చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు.చిన్నపిల్లల అన్న కనికరం కూడా లేకుండా వారి పట్ల మృగంలా ప్రవర్తిస్తున్నారు.ఇటువంటి కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఎంత కఠిన చర్యలు అమలు చేసినా కూడా వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి రోజూ దేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన మహారాష్ట్ర లో చోటు చేసుకుంది.

చిన్నారికి స్నాక్స్ ఇస్తానని ఆశ చూపించి మేన మామే చిన్నారి పట్ల కలయముడయ్యడు. వివరాలలోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో,ఇగ్లస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికపై సొంత మేనమామ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపుతోంది.9 ఏళ్ల చిన్నారి తో పాటు తన ఇద్దరు చెల్లెళ్లను స్నాక్స్ ఆశచూపి తీసుకెళ్లిన మేనమామ తర్వాత ఇద్దరు చెల్లెళ్లను ఇంటికి పంపి 9 ఏళ్ల చిన్నారిని మాత్రం తన వద్ద ఉంచుకున్నాడు.

తన ఎవరు గమనించలేదు అని నిర్ధారించుకున్న తర్వాత బాలికల మీద అత్యాచారం చేసి విషయం బయటపడుతుందనే భయంతో బాలికను ఇటుక రాయి తో కొట్టి హత్య చేశాడు. బాలిక శవాన్ని ఎవరికీ కనిపించకుండా వుడ్ గోడౌన్ వెనక దాచి పెట్టాడు. కూతురు ఎంతసేపటికి తిరిగి రాకపోవటంతో తల్లితండ్రులు చిన్నారి కోసం చుట్టుపక్కల గాలించారు. నిందితుడు కూడా తనపై అనుమానం రాకుండా వారితో పాటు చిన్నారిని వెతుకుతూ వారిని పక్క దారి పట్టించాడు.తర్వత తల్లితండ్రులు ఇద్దరి చిన్నారులను ప్రశ్నించగా మేనమామ తమనీ బయటకి తీసుకెళ్ళాడని చెప్పారు. దీంతో వారికి అనుమానం వచ్చి నిందితుడి మీద కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల తానే బాలికను అత్యాచారం చేసి, హత్య చేసి చంపాడని ఒప్పుకోవడంతో అతని మీద కేసు నమోదు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Advertisement
Exit mobile version