Ys Jagan Vizag Tour : ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికలు ముగిశాక మళ్లీ జగన్ ప్రజల్లో ఎక్కువగా మమేకం కాలేకపోయారు. ఎన్నికలు వచ్చినా కూడా ఆయన పేరు, జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఆయన ఫోటోను చూసి జనాలు ఇన్నిరోజులు ఓట్లు వేస్తూ వచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జగన్ ఎక్కువగా కనిపించలేదు.
ఏకంగా రెండున్నరేళ్లకు జగన్ ప్రజల వద్దకు వెళ్లాలని, జనంతో మమేకం కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే వరుసగా పర్యటనలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోను సుదీర్ఘ కాలం తర్వాత ఆయన రాయలసీమలో పర్యటించారు.ఇటీవల ఏపీ వరుస తుఫాన్లు ముప్పేట దాడి చేశాయి. వీటి వలన నష్టపోయిన తీర ప్రాంత వాసులను జగన్ కలిసి వారికి భరోసా ఇచ్చారు.
జగన్ తీరప్రాంత వాసుల వద్దకు వెళ్లినప్పుడు ప్రజల నుంచి రెస్పాన్స్ అదిరిపోయింది. ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఆయన పర్యటన సాగింది. తర్వాత ఆయన విశాఖలో పర్యటించనున్నట్టు సమాచారం. అక్కడ కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
జగన్ వెంట ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణలు ఉండనున్నారు. ఇకపోతే ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణ తర్వాత జగన్ తొలిసారి విశాఖలో పర్యటించనున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా కొనసాగించాలని.. ఆ బిల్లును వెనక్కి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ సమితి నాయకులు ఇదివరకు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ టైంలో ఆయన వైజాగ్ వెళ్లనున్నారు.
విశాఖపట్నం-భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ రహదారి, కోస్టల్ హైవేకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇండ్రస్టియల్, ఐటీ పార్కుల ఏర్పాటు, నిర్మాణ పనులను కూడా చేపట్టే అవకాశాలున్నాయి. విశాఖలో అభివృద్ధి పనులకు, కోస్టల్ బ్యాటరీ టు నేరెళ్ల వలస వరకు ప్రతిపాదించిన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని సమాచారం. ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేయనున్నారు. బీచ్ ఫ్రంట్ రీ డెవలప్‌మెంట్‌లో భాగంగా పలు డెవలప్ మెంట్ వర్క్స్‌కు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. జగన్ పుట్టిన రోజున రచ్చబండ ప్రోగ్రాం ద్వారా జనంలోకి జగన్ వెళ్లనున్నట్టు తెలిసింది.
Read Also : Chandrababu : 2024 ఎన్నికలే టార్గెట్.. ఏరివేతలు షురూ చేసిన చంద్రబాబు?
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.