Nara Lokesh Counter : ఏపీ సీఎం జగన్ సర్కారుపై విపక్షాలు టార్గెట్ చేశాయి. ఏపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాలకు చేస్తున్న విమర్శలకు నంద్యాల బహిరంగ సభ వేదికగా సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఏపీ ప్రజల దీవెనలు ఉన్నంతకాలం వాళ్లు ఎవరూ నా వెంట్రుక కూడా పీకలేరని జగన్ ధ్వజమెత్తారు. ప్రజల దీవెనలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని అన్నారు. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య కూడా జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఒక సీఎం హోదాలో ఉండి ఇలాంటి బజారు భాష మాట్లాడతారా? అంటూ ప్రశ్నించారు. కొడాలి నానిలా సీఎం మాట్లాడటం సరికాదన్నారు. సీఎం జగన్ భాష చూస్తే.. మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు. పాలన చేయడం చేతకాకే ఇలా ప్రస్టేషన్ తో సీఎం జగన్ మాట్లాడుతున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. విపక్షాలు, పత్రికలపై బూతులు మాట్లాడటం శోచనీయమని వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.
ఈకల ఎంపరర్ వైఎస్ జగన్.. నారా లోకేశ్ కౌంటర్ :
ఏపీ సీఎం జగన్‌ను టార్గెట్ చేసి టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విపక్షాలన్నీ ఏకమైనా తనను ఏమీ చేయలేరని, నా వెంట్రుక కూడా పీకలేరని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలపై చేయడంపై లోకేశ్ స్పందించారు. లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్‌పై విరుచుకుపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? లోకేష్ జగన్ తీరును తప్పుబట్టారు. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ వైఎస్ జగన్ గారు మీ వెంట్రుకలు పీకే ఓపిక గానీ, తీరిక గానీ మాకు లేవు అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నామని లోకేష్ సెటైర్లు వేశారు.
ప్రజల దీవెనలతోనే ఈ స్థాయికి వచ్చా.. నా వెంట్రుక కూడా పీకలేరు : సీఎం జగన్
అంతకుముందు నంద్యాల బహిరంగ సభలో విపక్షాలపై తీవ్రస్థాయిలో సీఎం జగన్ మండిపడ్డారు. ఏపీ రాష్ట్ర ప్రజలే నాకు దేవుళ్లు. వాళ్ల దీవెనలతోనే నేను ఈ స్థాయికి వచ్చానని సీఎం జగన్ అన్నారు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకు పడ్డారు.
దేవుడి దయ వల్ల, ప్రజల దీవెనలు తనకు ఉన్నంత కాలం వాళ్లు ఎవరూ నా వెంట్రుక కూడ పీకలేరని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో విపక్షాలకు కడుపు మంట, అసూయ పెరిగిందన్నారు. అలాంటి అసూయకు మందే లేదన్నారు. అదే అసూయ ఎక్కువైతే బీపీ, షుగర్ తో పాటు గుండెపోటు కూడా వస్తుందని సీఎం జగన్ చెప్పారు. అంతే కొనసాగితే ఏదో రోజు టికెట్ తీసుకుంటారని జగన్ ఎద్దేవా చేశారు.
Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…
Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…
Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…
Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
This website uses cookies.