Valentines Night Movie Review : మంచి మెసేజ్ ను ఇచ్చే ‘వాలెంటైన్స్ నైట్’..

Valentines Night Movie Review : చైతన్య రావు, లావణ్య జంటగా నటించిన నటించిన చిత్రం ‘వాలెంటైన్స్ నైట్’. సునీల్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, అవినాష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. అనీల్ గోపిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తృప్తి పాటిల్‌, సుధీర్ యాలంగి, మ‌హీంధ‌ర్ ఎంఒ నారాల నిర్మాత‌లు. సంగీతం అనీల్ గోపిరెడ్డి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జ‌న‌వ‌రి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చింది. డ్రగ్స్… మనీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం… ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: అజయ్(చైతన్య రావు) ఓ రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. అతడు ప్రియ(లావణ్య)తో ప్రేమలో ఉంటాడు. అయితే వీరిద్దరికీ అనుకోకుండా బ్రేకప్ అవుతుంది. అలాగే డ్రగ్ మాఫియా లీడర్ గా (శ్రీకాంత్ అయ్యంగార్) సిటీలో చెలామణి అవుతుంటారు. ఆ డ్రగ్ మాఫియా ఆటకట్టించే పనిలో కృష్ణ మోహన్(సునీల్) ఒక్కొక్కరి పని పడుతూ ఉంటారు. ఈ క్రమంలో డ్రగ్ వ్యాపారం చేస్తూ పెడదోవ పట్టిన ఆలీ(ముక్కు అవినాష్) అనే కుర్రాణ్ని మారుస్తాడు. అదే సమయంలో వేద(దివ్య)అనే అమ్మాయి డ్రగ్ అడిక్ట్ మారి… జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. అజయ్, ప్రియ మళ్లీ కలుసుకున్నారా? డ్రగ్ వ్యాపారి కథ ఎలా ముగిసిందనేది మిగతా కథ.

కథ… కథనం విశ్లేషణ: వాలెంటైన్ నైట్… ఒక సోషల్ మెసెజ్ ఉన్న మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ. డ్రగ్స్ సమస్యల నేపథ్యాన్ని తీసుకుని వివిధ‌ వ్యక్తుల, జంటల జీవితాల సమాహార కథ… కథనంతో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించిన చిత్రం వాలెంటైన్ నైట్స్‌. నగరంలో డ్రగ్స్ మాఫియా ముఠాలను ఛేదించడానికి ప్రయత్నిస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్. మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఉన్న ఇద్దరు క్రిమినల్స్‌ తో సంబందం ఉన్న ఒక పాత బస్తీ క్యాబ్ డ్రైవర్… సమాజానికి ఉపయోగపడే సినిమాలనే తీస్తున్న సచ్చీలత, నైతిక, నిబద్దత ఉన్న ఒక బతికి చెడిన నిర్మాత… తండ్రి కోసం, కుటుంబం కోసం ప్రాణంగా ప్రేమించిన‌ ప్రియురాలిని దూరం చేసుకోవడానికి సిద్దపడ్డ ఆర్జేగా పని చేస్తున్న యువకుడు.. దురదృష్టవశాత్తు తల్లిదండ్రులను కోల్పోయి డ్రగ్స్ బానిస అయి డ్రగ్స్ పెడ్లర్‌గా మారిన ఒక కుర్రాడు. ప్రేమ రాహిత్యానికి బలైన దారి తప్పిన ఒక ధనవంతుల అమ్మాయి. డబ్బే పరమావధిగా బతుకుతూ కుటుంబాన్ని పట్టించుకోని ఒక సంపన్న వ్యాపారవేత్త…

valentines-night-movie-review-and-rating-in-telugu

ఇందులో ప్రతీ పాత్ర చాలా డిస్టర్బ్‌ గా, సమస్యలతో కనిపిస్తుంది.. ఆ పాత్రలు వాళ్ల జీవితాలు ఏ విధంగా ముడిపడి ఉన్నాయి.. ఒకరి జీవితాన్ని ఇంకొకరు ఏ విధంగా ప్రభావితం చేశారు అనే అంశాలను తెరమీద ఆవిష్కరించిన తీరు… చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మాదక ద్రవ్యాల వల్ల యూత్ ఎలా తమ జీవితాలను బుగ్గపాలు చేసుకుంటున్నారు అనేది నిత్యం మనం వార్తల్లో చూస్తుంటాం. దాన్ని ఒక సామాజిక సమస్యగా తీసుకుని… ఇందులో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారు అనేది నిత్యం పరిశీలిస్తూ వుండాలనే మెసేజ్ ని ఇచ్చారు. అలాగే డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికే ఓ పారిశ్రామిక వేత్త… కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా ఉంటుందనే దాన్ని చక్కగా చూపించారు. ఇలా ప్రతి పాత్రకు మంచి జస్టిఫికేషన్ ఇచ్చి… వాలెంటైన్ నైట్ ను మరింత ఆస్తికరంగా సాగేలా మలిచాడు దర్శకుడు అనీల్.

చైతన్య రావు… చాలా బిజీగా ఉన్న నటుడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇందులో ఆర్.జె. అజయ్ గా తన నటన ఆకట్టుకుంటుంది. చాలా డీసెంట్ గా ఉంటుంది. అలాగే తనకు జోడిగా ప్రియ పాత్రలో నటించిన లావణ్య పాత్ర కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. కట్టుకున్న భార్యను, కూతురుని వదిలేసి డబ్బు సంపాధనే ధ్యేయంగా బతికే ఓ బిజినెస్ మ్యాన్ గా శ్రీకాంత్ అయ్యంగార్ నటన ఆకట్టుకుంటుంది. అతని ఫ్రెండ్ గా నటించిన రవి వర్మ పాత్ర కూడా బాగుంది. అతని భార్యగా మాయ పాత్రలో నటించిన బిందు చంద్రమౌళి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఆమె కూతురుగా దివ్య పాత్రలో నటించిన వేద కూడా మెప్పిస్తుంది. సునీల్ అక్కడక్కడ కాసేపు కనిపించినా… క్యారెక్ట‌రైజేష‌న్ ఆడియ‌న్స్‌లో రిజిస్ట‌ర్ అవుతుంది. మిగ‌తా పాత్రలు వారి ప‌రిది మేర న‌టించారు. అనీల్ గోపిరెడ్డి ఇచ్చిన పాట‌లు, నేపత్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు తెరమీద చూపించిన కథ, కథనాలు బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా ఖర్చకు వెనకాడకుండా సినిమాని నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!

రేటింగ్‌: 3

Read Also : Dosthan Movie Review : లవ్, ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘దోస్తాన్’ మూవీ రివ్యూ

Recent Posts

Diwali 2024 : లక్ష్మీదేవీకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వు ఏడాదిలో 2 రోజులు మాత్రమే కనిపిస్తుంది.. దీపావళి పూజలో ప్రత్యేకమైనది..!

Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…

1 week ago

Paneer Mughalai Dum Biryani : నోరూరించే పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యాని.. ఇలా చేశారంటే చికెన్ బిర్యానీ కన్నా టేస్ట్ అదిరిపొద్ది..!

Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…

4 weeks ago

Kidney Stones : శరీరంలో నీరు తగినంత లేకుంటే ఈ ప్రాణాంతక వ్యాధి వస్తుంది జాగ్రత్త.. రోజుకు ఎంత నీరు తాగాలంటే?

Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…

4 weeks ago

Senior Actress : కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు ఇచ్చేసిన ప్రముఖ సినీనటి ఎవరంటే?

Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…

4 weeks ago

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

9 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

10 months ago

This website uses cookies.