Ajay Devgn: కన్నడ స్టార్ హీరో సుదీప్ , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కూడా తెలుగు సినిమాలలో కూడా నటించి తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు . అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరోల మధ్య హిందీ భాష గురించి గొడవ జరుగుతోంది. కన్నడ స్టార్ హీరో సుదీప్ హిందీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ అజయ్ దేవగన్ సోషల్ మీడియా వేదికగా సమాధానం ఇచ్చారు.
ఇటీవల నిర్వహించిన ‘ఆర్: ది డెడ్‌లీస్ట్ గ్యాంగ్‌స్టర్ ఎవర్’ అనే సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమంలో సుదీప్ మాట్లాడుతూ… ” కన్నడ సినీ పరిశ్రమ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తీస్తోందని కొందరు అంటున్నారు. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. పాన్ ఇండియా స్థాయి అని కాకుండా ప్రపంచంలోని సినీ అభిమానులందరినీ అలరించడానికి మనం సినిమాలు చేస్తున్నాం. హిందీ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నా కూడా వాటిని తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ ఆ సినిమాలు విజయ సొంతం చేసుకోలేక పోతున్నాయి”. అంటూ సుదీప్ మాట్లాడాడు.
ఇలా సుదీప్ మాట్లాడిన మాటలకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ స్పందిస్తూ..” బ్రదర్ మీఉద్దేశం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు మీరు ఎందుకు మీ సినిమాలను హిందీలో డబ్ చేస్తున్నారు. ఎంతో కాలం నుండి హిందీ జాతీయ భాషగా ఉంది. ఎప్పటికీ కూడా ఉంటుంది. జనగణమన” అని అజయ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇలా అజయ్ దేవగన్ చేసిన ట్వీట్ కు సుదీప్ సమాధానమిస్తూ..” అజయ్ సర్ నేను చెప్పింది మీరు సరిగా అర్థం చేసుకోలేదు అనుకుంటా.. మన దేశ భాషలన్నింటి పైన నాకు చాలా గౌరవం ఉంది. నేను హిందీ భాషను ప్రేమించాను కనుక హిందీ భాషను మాట్లాడటం నేర్చుకున్నాను. అందువల్ల మీరు హిందీలో పెట్టిన ట్వీట్ ని కూడా చడవగలిగాను. అదే నేను కన్నడలో సమాధానం రాసుంటే మీరు దాన్ని చదవగలరా? ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. మీ దగ్గర నుండి రిప్లై ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇంతటితో ఈ టాపిక్ ముగిద్దాం. తొందర్లోనే మనిద్దరం కలుసుకోవాలని కోరుకుంటున్నాను” అని సుదీప్ ట్వీట్ చేశాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య హిందీ భాష గురించి ట్వీట్ వార్ జరిగింది. మరి ఈ వారం ఇంతటితో ముగుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.