Horoscope : ఈ వారం అంటే మే 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉందో తెలుసుకోండి. ముఖ్యంగా ఓ మూడు రాశుల వారికి ఈ వారమంతా శుభ ఫలితాలే. వారు ఏ పని చేసినా విజయం సాధించడం కాయం. అయితే ఆ మూడు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా .. బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. ఎటుచూసినా శుభఫలితాలే గోచరిస్తున్నాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. స్థిరత్వం వస్తుంది. వ్యాపారబలం పెరుగుతుంది. భవిష్యత్తును నిర్మించుకునే కాలమిది. సదవకాశాలు వస్తాయి. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. ఇష్టదేవతారాధన శ్రేష్ఠం.
కన్యా రాశి.. అదృష్టయోగముంది, తగినంత కృషి చేయండి. ప్రయత్నాలు ఫలించే సమయం. ఉద్యోగంలో మేలుచేసేవారున్నారు. గొప్ప ఆలోచనలు వస్తాయి, సకాలంలో ఆచరణలో పెట్టాలి. మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది. తోటివారిని కలుపుకెళ్లాలి. మంచి పనులతో కీర్తి సంపాదిస్తారు. ఆదిత్యహృదయం చదవండి, విఘ్నాలు తొలగుతాయి.
వృశ్చిక రాశి.. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. ముఖ్యకార్యాల్లో శీఘ్ర విజయముంది. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. అపోహలు తొలగుతాయి. కొత్తబంధాలు చిగురిస్తాయి. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. గృహవాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. వస్తుప్రాప్తి సూచితం. సూర్యనమస్కారం శుభప్రదం.
Read Also : Horoscope: ఈరోజు ఈ రెండు రాశుల వారు కచ్చితంగా గుడ్ న్యూస్ వింటారు..!
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.