Megastar Chiranjeevi : Chiranjeevi Comments During Yoda Diagnostics Health Card Distribution
Chiranjeevi : ఇండస్ట్రీ పెద్దరికం పదవిలో నేను ఉండనని మెగాస్టార్ చిరంజీవి సంచనల వ్యాఖ్యలు చేశారు. అవసరం వస్తే తప్పకుండా అక్కడ తాను ముందు వుంటానని అన్నారు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం.. నాకు వద్దన్నారు. ఇండస్ట్రీకి సమస్య వున్నా, కార్మికులకు ఏ సమస్యా ఉన్నా.. ఎప్పుడు ఆదుకోవడానికి సిద్ధంగా వుంటానని హామీ ఇచ్చారు. ఇద్దరు కొట్టుకొని పంచాయితీ చెయ్యమంటే చెయ్యనని చిరంజీవి తేల్చి చెప్పేశారు.చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆదివారం యోధ డయోగ్నస్తిక్ లైఫ్ టైం హెల్త్ కార్డులు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి జీవితం అతలాకుతలం చేసిందన్నారు. సినీ పరిశ్రమకు కూడా ఏదైనా చెయ్యాలి అని యోధ డయజ్ఞాస్టిక్ వారిని అడిగిన వెంటనే వాళ్లు సరేనన్నారు. కరోనా టైంలో ఇంటింటికీ వెళ్లి సీసీసీ వాళ్లు నిత్యావసరాలు అందచేశారని చిరంజీవి తెలిపారు.
టెక్నికల్‌తో కూడిన ఈ కార్డులో QR కోడ్ ఉంటుందని, ఆ కార్దూకి చెందిన వారి కుటుంబ సభ్యుల హెల్త్‌కు సంబంధించి వివరాలు మొత్తం ఉంటాయన్నారు. ప్రస్తుతం 18 యూనియన్లు కార్డులు రెడీ అయ్యాయని తెలిపారు. దాదాపు 7700 కార్డులు తయారు కాగా.. మిగతావి ఈ నెలాఖరు లోపు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 50 శాతం రాయితీతో ఆ కార్డును వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ కార్డును వినియోగించుకోవాలని చిరంజీవి సూచించారు. కార్మికులకు సంబంధించి ఎవరికి ఏమి వచ్చినా సినీ పరిశ్రమ అంతా నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని చెప్పారు.
కార్మికులకు ఎప్పుడు నేను అండగా వుంటానని చిరంజీవి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. మా డగ్నస్తిక్ సెంటర్ ప్రారంభించినప్పుడు మేము ప్రామిస్ చేసామని అన్నారు. సినీ కార్మికులకు 50శాతం రాయితీ ఇస్తామని ఈ రోజున కార్డుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
Read Also : RRR Movie Release : ‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ వాయిదా పడింది.. ఎప్పడంటే?
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.