12 Zodiac Signs : ఈరోజు మేషరాశి వారికి ఆర్థికంగా బాగుంది. కుటుంబసౌఖ్యం కూడా బాగుంది. మొత్తం మీద పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారికి కుటుంబసౌఖ్యం చక్కగా ఉంది. సన్నిహితులతో సఖ్యత పెరుగుతుంది, కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మిధున రాశిలో ఉన్న వారికి పాతబాకీలు వంటివి వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పనులు అయితే సకాలంలో పూర్తి చేస్తారు.మొత్తం మీద మిధున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, విందువినోదాలు, ఇంటా బయట కూడా అనుకూలత.
ఆర్థిక విషయంలో వీరికి మిశ్రమంగా ఉంది. సింహ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని రావు అని అనుకున్న మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. డబ్బుకొచ్చిన ఇబ్బందులు ఏమీ లేవు.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యా రాశి వారికి కుటుంబసౌఖ్యం చక్కగా ఉంది. ఇదే సమయంలో ఆర్థికంగా అనుకూలంగా లేదు. కొన్ని ఖర్చులు ఎక్కువ అవుతాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. వీరు తలపెట్టే చర్చల్లో పురోగతి కనిపిస్తుంది. మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. తులా రాశి వారికి ఇంటాబయటా కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మీయ తో చక్కటి సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కొత్త పనులను కూడా చేపడతారు. వీరిలో దైవ చింతన పెరుగుతుంది.
వృశ్చిక రాశి వారు కీలక నిర్ణయాల వంటివి తీసుకుంటారు.అనుకున్న వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. వాహన యోగం కూడా ఉంది. వ్యాపార, ఉద్యోగ రంగాల వారి విషయంలో చక్కటి పురోభివృద్ధి ఉంది. ధనుస్సు రాశి వారు శుభకార్యాల వంటివి నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక, పనులు అయితే సకాలంలో పూర్తవుతాయి. ఇక ఆర్థికంగా వీరికి మిశ్రమంగా ఉంది. కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి. దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు. మకర రాశి వారికి ఈ రోజు సమస్యల వంటివి తొలగిపోయి వీరికి ఈ రోజు ప్రశాంతత లభిస్తుంది. పనులైతే విజయవంతంగా ముగిస్తారు. విద్యార్థులు శుభవార్తను అందుకుంటారు. వ్యాపార,ఉద్యోగ రంగాలవారికి సంబంధించి కొత్త ఆశలు, ఆలోచనలు కూడా కలిసివస్తాయి. ఈ రోజు మకర రాశి వారికి అంతట అనుకూలమైన ఫలితాలనే చెప్పవచ్చు. కుంభ రాశి వారికి కొన్ని ఆకస్మిక ప్రయాణాలు వంటివి సంభవిస్తాయి.
ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం కనిపిస్తోంది ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార,ఉద్యోగ రంగాల వారికి చికాకులన్ని తొలగిపోతాయి. వారు తలపెట్టిన రంగాలు మరింత పుంజుకుంటాయి. మొత్తంమీద కుంభ రాశి వారికి ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలనే చెప్పవచ్చు. రాశులన్నింటిలో మనకు చివరి రాశి మీన రాశి. ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబసౌఖ్యం చక్కగా ఉంది.
బంధువుల కలయిక, శుభవార్తలు వంటివి కూడా వింటారు.అయితే ఆర్థికం మాత్రం మిశ్రమంగా ఉంది. కొన్ని పాతబాకీలు వసూలు అవ్వడం వల్ల డబ్బుకొచ్చిన కష్టాలు ఏమీ ఉండవు. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. విద్యార్థులయితే ఈరోజు సానుకూల ఫలితాలనే అందుకుంటారు. మొత్తంమీద చూసుకుంటే వ్యాపార వ్యవహారాలకైతే ముఖ్యంగా చాలా అనుకూలంగా ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక మిశ్రమంగా ఉన్నా, పెద్దగా ఇబ్బందుయితే ఏమీ లేవు.
Read Also : పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పకుండా పాటించాల్సిందే..!
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.