Inspiring news: ఇండియాలోనే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలైన ఐఐటీల్లో చదువుకోవాలని చాలా మందికి కోరిక ఉంటుంది. దీని కోసం ఎంతో కష్టపడతారు. చిన్నప్పటి నుండి ఐఐటీల కోసమే చదివే వారు చాలా మందే ఉంటారు. ఐఐటీ ఫౌండేషన్ ఉన్న విద్యాసంస్థల్లో చేరి చదవడం మొదలు పెడతారు. గేట్ లాంటి పరీక్షలు రాసి ఐఐటీలో సీటు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పరీక్షల్లో గేట్ ఒక్కటి. అలాంటిది కష్టపడి ఐఐటీలో సీటు సాధించి తర్వాత దానిని వదిలిపెట్టుకోవడం అంటే ఆశ్చర్యపోవాల్సిందే.
గుజరాత్ లోని సూరత్ కు చెందిన 23 ఏళ్ల వందిత్ పటేల్ కు గేట్ లో మంచి ర్యాంకు వచ్చింది. కానీ తన డ్రీమ్ ఐఐటీలో సీటు రాలేదని… వచ్చిన ఆ ఐఐటీ సీటును వదులుకున్నాడు. వందిత్ పటేల్ కంప్యూటర్ సైన్స్ మైనరర్ తో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో నిర్మా యూనివర్సిటీ నుండి 2020లో గ్యాడ్యూయేషన్ పూర్తి చేశాడు. గేట్ 2021లో 842 ర్యాంకు వచ్చినా గౌహతి, భువనేశ్వర్, ధన్ బాద్, వారణాసిలోని ఐఐటీలో అడ్మిషన్లకు అర్హత ఉన్నప్పటికీ వెంటనే జాయిన్ అయిపోలేదు. పటేల్ IISc బెంగళూరు లేదా ఫస్ట్ లెవల్ ఐఐటీ నుండి ఎంటెక్ డేటా సైన్స్ చదవాలనే లక్ష్యంతో మళ్లీ గేట్ రాయాలని నిర్ణయించుకున్నాడు.
996 గేట్ స్కోర్ తో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సంపాదించాడు. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐఎస్సీ అనే 3 కాలేజీల్లో తప్ప ఏ కాలేజీలో కూడా చేయకూడదని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
ఉపేంద్ర నటించిన యూఐ ఎట్టకేలకు డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
CAT 2024 Results : అభ్యర్థుల స్కోర్‌కార్డులను పరీక్ష అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.inలో అప్‌లోడ్ చేసింది. క్యాట్ 2024 పరీక్షను…
This website uses cookies.