Oscar Awards : సినీ పరిశ్రమకి అతి పెద్ద అవార్డు ఏదైనా ఉంది అంటే అది ” ఆస్కార్ ” మాత్రమే. ఎంతో మంది సినిమా వాళ్లకి ఆస్కార్ ఒక కల. తాజగా 94వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ మంగళవారం ఫిబ్రవరి 8న వెల్లడయ్యాయి. ట్రెసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ ఆస్కార్ నామినేషన్స్ ప్రకటనకు యాంకర్స్ గా వ్యవహరించారు. ఆస్కార్ నామినేషన్స్ అన్ని విభాగాలలోనూ నామినేట్ అయిన సినిమాలని, సినిమా వ్యక్తులని వెల్లడించారు.
ఈ సారి నామినేషన్స్ లో ఇండియా నుంచి ఒకే ఒక్క డాక్యుమెంటరీ సినిమా చోటు దక్కించుకుంది. మన దేశం నుంచి ఢిల్లీకి చెందిన ఫిల్మ్‌మేకర్స్ రిటు థామస్, సుస్మిత్ ఘోష్ తీసిన ‘రైటింగ్ విత్ ఫైర్’ అనే సినిమా ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకుంది. ఈ సినిమా బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఇప్పటికే పదిహేనుకు పైగా వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించింది. దీంతో ఈ డాక్యుమెంటరీ ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు.
ఆస్కార్ నామినేషన్స్ లో ఈ సారి ‘ద పవర్ ఆఫ్ ది డాగ్’ సినిమా ఏకంగా 12 నామినేషన్లలో చోటు దక్కించుకుంది. ‘డ్యూన్’ సినిమా 10, ‘వెస్ట్ సైడ్ స్టోరీ’, ‘బెల్‌ఫాస్ట్’ సినిమాలు 7 కేటగిరీలలో నామినేషన్లు దక్కించుకున్నాయి. ఈ సారి ఉత్తమ చిత్రం అవార్డు కోసం ఏకంగా పది సినిమాలు పోటీ పడుతున్నాయి. 94వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం మార్చి 27న జరగనుంది. ఏ సినిమాకి ఏ అవార్డు వచ్చిందో తెలుసుకోవాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే.
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.