Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ పని చేసే హోటల్ కు వచ్చిన మోనిత ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేస్తుంది. ఇక కార్తీక్ వైపుగా ఉన్న వాష్ బేసిన్ దగ్గరకు వెళుతుండగా కార్తీక్ తన దగ్గరికి వస్తుందేమో అని తెగ కంగారు పడతాడు. కానీ చేతులు వాష్ చేసుకోడానికి అక్కడికి వెళుతుంది.
దాంతో దీప ఎందుకు? అని అడగటంతో రుద్రాణి మీ పిల్లల పై కన్నేసిందని.. వచ్చేనెల రుద్రాణి పుట్టినరోజు సందర్భంగా రెండు గౌనులు కొలతలు ఇచ్చిందని.. చెబుతుంది ఆవిడ. ఇక ఆ గౌను కొలతలు కచ్చితంగా మీ పిల్లలివే అని అంటుంది. దాంతో ఒక్కసారిగా దీపకి గుండె పగిలినంత పని అవుతుంది. ఆ హోటల్లో తినడం పూర్తయిన మోనిత బిల్ పే చేసి అప్పు కు టిప్పు ఇస్తుంది.
మోనిత వెళుతుండగా అప్పు ఒక సెల్ఫీ అడుగుతాడు. నవ్వుతూ సెల్ఫీ దిగి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. దాంతో కార్తీక్ ఊపిరి పీల్చుకుంటాడు. మరోవైపు సౌందర్య, ఆనందరావు లు ప్రకృతి వైద్యశాల లో ప్రశాంతంగా కూర్చుని కార్తీక్ ఈ ఊళ్ళో అయినా కనిపిస్తాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ట్విస్ట్ ఏంటి అంటే.. ఏకంగా దీప రుద్రాణి ఇంటికి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది.
ఆ సమయంలో రుద్రాణి ఇంట్లో ఉండదు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన రుద్రాణి ఇంట్లో వంట చేసే దీపను చూసి షాక్ అవుతుంది. రుద్రాణి ఇక్కడ ఏం పని అని అడగటం తో మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. అందుకే వచ్చానని వెటకారంగా సమాధానం చెబుతుంది. ఆ సమాధానానికి రుద్రాణి మండిపడుతుంది. దానికి దీప నీ ఇంట్లో వంట వండితేనే ఇంత కోపం వచ్చినప్పుడు నా పిల్లల పై కన్నేసిన నీ పై.. నాకు ఇంకెంత ఉండాలి అని హీరో లెవెల్ లో అంటుంది దీప.
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.