Astrology News : సాధారణంగా చాలా మంది వాహనాలను కొనుగోలు చేసిన తరువాత వాటికి న్యూమరాలజీ ప్రకారం తమ లక్కీ నంబర్లు వచ్చేలా నంబర్లను సెట్ చేసుకుంటుంటారు. కొందరైతే ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడరు. అయితే వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా జాతకం ప్రకారం తమ రాశికి సంబంధించిన కలర్ కలిగిన వాహనాన్నే కొనుగోలు చేయాలి. దీంతో ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. అలాగే ఆ వాహనంపై ఎక్కడికి వెళ్లి ఏ పని చేసినా కలసి వస్తుంది. కనుక ఎవరైనా సరే తమ రాశికి అనుగుణంగా కలర్‌ను ఎంపిక చేసుకుని దాని ప్రకారం వాహనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
అలానే ప్రస్తుతం చాలా వరకు వాహనాలను మిక్సింగ్ కలర్‌లలో అందిస్తున్న నేపథ్యంలో ఒకే కలర్ కలిగిన వాహనాలు లభించడం కాస్త కష్టమే అని చెప్పవచ్చు. అయితే మిక్సింగ్ కలర్స్ ఉండే వాహనాలను తీసుకునే పని అయితే… వాటిల్లో మెయిన్ కలర్ లేదా అధిక భాగం కలర్ రాశి చక్రానికి చెందినది అయి ఉండే విధంగా చూసుకోవాలి. దీంతో జాతక చక్రం సెట్ అవుతుంది. అనుకూల ఫలితాలు పొందవచ్చు.
మేష రాశి : ఈ రాశి వారు ఎరుపు రంగు వాహనాలను వాడితే మంచిది. ఈ రంగు వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే ప్రస్తుతం కొన్ని వాహనాలు మిక్సింగ్ కలర్‌లో వస్తున్నాయి. అలాంటప్పుడు మెయిన్ కలర్ రెడ్ ఉండేలా చూసుకోవాలి. దీంతో రాశి ప్రకారం వాహనానికి కలర్ సెట్ అవుతుంది. అది శుభ ఫలితాలను అందిస్తుంది.
వృషభ రాశి : ఈ రాశి వారు పింక్ లేదా తెలుపు రంగులో ఉండే వాహనాలను వాడితే మంచిది. ఈ రంగులు వారికి కలసి వస్తాయి.
మిథున రాశి : ఈ రాశి వారు పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగుల్లో దేన్నయినా వాడవచ్చు. ఆ రంగుల్లో ఉండే వాహనాలను కొని వాడాల్సి ఉంటుంది. దీంతో అనుకూల ఫలితాలు వస్తాయి.
సింహ రాశి : ఈ రాశి వారు బంగారం, నారింజ, పర్పుల్ రంగుల్లో ఉండే వాహనాలను వాడితే మంచి జరుగుతుంది.
కర్కాటక రాశి : ఈ రాశి వారు బూడిద రంగు లేదా తెలుపు, సిల్వర్, క్రీమ్ కలర్లలో ఏ రంగు కలిగిన వాహనాన్ని అయినా వాడవచ్చు.
కన్యా రాశి : ఈ రాశి వారు నీలం, ఆకుపచ్చ, పసుపు, తెలుపు రంగులు శుభ ఫలితాలను అందిస్తాయి. కనుక ఈ రంగుల్లో ఉండే వాహనాలను వాడాలి.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు తెలుపు, ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే వాహనాలను వాడితే మంచిది.
తుల రాశి : ఈ రాశి వారు తెలుపు, నీలం రంగుల్లో ఉండే వాహనాలను వాడితే మంచిది. అనుకూల ఫలితాలను పొందవచ్చు.
దనుస్సు రాశి : ఈ రాశి వారు ముదురు పసుపు లేదా నారింజ రంగుల్లో ఉండే వాహనాలను వాడాలి. అనుకూల ఫలితాలు వస్తాయి.
మకర రాశి : ఈ రాశికి చెందిన వారు నలుపు, పర్పుల్, ముదురు గోధుమ, ఆకుపచ్చ రంగుల్లో ఉండే వాహనాలను వాడవచ్చు.
మీన రాశి : ఈ రాశి వారికి పసుపు, నారింజ రంగుల్లో ఉండే వాహనాలను వాడితే మంచిది. అనుకూల ఫలితాలను పొందవచ్చు.
కుంభ రాశి : ఈ రాశి వారు నీలం, పర్పుల్, తెలుపు రంగుల్లో ఉండే వాహనాలను వాడితే మేలు జరుగుతుంది.
Read Also : Health Tips : పొట్ట సమస్యతో సతమతమవుతున్నారా… ఈ టిప్స్ మీకోసమే !
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.