Rododendro benefits : కరోనాను నివారించే ఫైటోకెమికల్స్ ను హిమాలయాల్లో పెరిగే ‘రోడోడెండ్రాడ్ అర్బోరియం’ అనే మొక్క పూరేకుల్లో ఐఐటీ మండి పరిశోధకులు గుర్తించారు. శాస్త్రీయ పద్దతుల్లో పరీక్షించి కరోనా వైరస్ ను నిరోధిస్తున్నట్లు తేల్చారు. టీకాయేతర ఔషధాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఈ మొక్కలో లభించే ఫైటో కెమికల్స్ కీలకంగా మారనున్నట్లు ఐఐటీ, ఐసీజీఈబీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొక్కను స్థానికంగా బురాన్ష్ గా పిలుస్తారు.
కోవిడ్-19 చికిత్సకు ఉపయోగపడే ఫైటోకెమికల్స్ ఈ మొక్క రేకుల్లో ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ఈ మొక్కలోని ఫైటోకెమికల్స్ వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయని పరిశోధనలో కనుగొన్నారు. పరిశోధనా బృందం కనుగొన్న విషయాలను బయో మోలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు.కరోనా వైరస్ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి రెండు సంవత్సరాలుగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇన్ ఫెక్షన్ ను నివారించడానికి మార్గాలను కనుగొనే పనిలో ఉన్నారు.
”వ్యాక్సినేషన్ అనేది వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే శక్తిని శరీరానికి అందించడానికి ఒక మార్గం. అయితే, మానవ శరీరంపై వైరల్ దాడిని నిరోధించే టీకాయేతర ఔషధాల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధన జరుగుతోంది. ఈ మందుల్లో రసాయనాలు ఉపయోగిస్తారు.
ఇవి మన శరీర కణాలలోని గ్రాహకాలను బంధించి, వైరస్ లోనికి ప్రవేశించకుండా నిరోధించగలవు లేదా వైరస్ పైనే పనిచేస్తాయి” అని IIT మండి స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ మసకపల్లి అన్నారు. హిమాలయాల్లోని వృక్షజాలం నుండి సేకరించిన రోడోడెండ్రాన్ అర్బోరియం రేకుల ఫైటోకెమికల్స్ను పరిశోధించామని, ఇది కోవిడ్ వైరస్‌కు వ్యతిరేకంగా పని చేస్తోందని పరిశోధకులు వెల్లడించారు.
Read Also : అతనే నా సర్వస్వం అంటున్న బాలీవుడ్ హీరో.. ఇంతకీ ఎవరాయన..?
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.