Man finds out has ovaries and uterus, he had been enstruating for 20 years
Men Menstruation : అతడు మగాడే.. ఎలాంటి ఆపరేషన్ చేయించుకోలేదు. 20ఏళ్లుగా పీరియడ్స్ వస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతుందో అతడికి అర్థం కాలేదు. ఏదో మూత్రసమస్య అనుకున్నాడు. చిన్నతనం నుంచే ఈ సమస్య ఉంది. అతడితోపాటు ఆ సమస్య కూడా పెరిగిపోతూ వచ్చింది. మూత్రంలో రక్తం పడుతుంది. తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. యుక్త వయస్సు వచ్చాక ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఎందుకు తనకు ఇలా జరుగుతుందో తెలియక ఒకరోజున వైద్యున్ని సంప్రించాడు. ఆ వైద్యుడు స్కానింగ్ చేయగానే షాకయ్యాడు.. ఏంటంటే.. అతడి కడుపులో గర్భాశయం ఉందని నిర్ధారించినట్టు తెలిపాడు. అందుకే అండాలు విడుదల అవుతున్నాయని.. నీకు ఆడవారి మాదిరిగా పీరియడ్స్ వస్తున్నాయని తెలిపాడు.
అతడు అతడేగానీ.. జీవశాస్త్రపరంగా అతడు ఆమె.. అని వైద్యులు తెలిపారు. ఈ వింతైన ఘటన నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో జరిగింది. ఒక వ్యక్తికి 20 ఏళ్లుగా మూత్రంలో రక్తం పడుతోంది. అతడి వయస్సు 33 ఏళ్లు… యుక్తవయస్సులో మూత్రవిసర్జన సమస్య ఉంటే ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి అతడికి మూత్రంలో రక్తం పడుతుంది. పొత్తికడుపులో నొప్పి వస్తోంది.
కడుపునొప్పి ఐదు గంటలుగా వస్తుండటంతో భరించలేక వైద్యుని వద్దకు వెళ్లాడు. అతడ్ని పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్‌గా నిర్ధారించారు. ఆపరేషన్ చేశారు. కానీ, కడుపునొప్పి మాత్రం తగ్గలేదు. వైద్యులు స్కానింగ్ తీయడంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అతడి కడుపులో గర్భాశయంతో పాటు అండాశయాలు ఉన్నాయని నిర్ధారించారు. మగ సెక్స్‌హార్మోన్లు ఆండ్రోజెన్ స్థాయిలు సగటు కన్నా తక్కువగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు.
ఆడ సెక్స్‌హార్మోన్లతో పాటు అండాశయ స్థాయిలు ఆరోగ్యకరమైన మహిళల్లో మాదిరిగానే ఉన్నాయని కనుగొన్నారు. మగ, ఆడ పునరుత్పత్తి అవయవాలతో ఇంటర్‌సెక్స్‌లో జన్మించినట్టు వైద్యులు నిర్ధారణకు వచ్చారు. అందుకే అతడి మూత్రంలో రక్తం, కడుపునొప్పి పీరియడ్స్ కారణంగానే వచ్చింది అని నిర్ధారణకు వచ్చారు. తనలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని తెలిసి అతడు బాధపడుతున్నాడు. ఎలాగైనా అవయవాలను తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. స్పెషలిస్ట్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స ద్వారా అతడిలోని స్త్రీ పునరుత్పత్తి అవయాలను విజయవంతంగా తొలగించారు. ఇప్పుడు అతడు సాధారణ పురుషుడిలానే మారిపోయాడు.
Read Also : Upasana -Ram Charan : రామ్ చరణ్ ఉపాసనకు పిల్లలు లేకపోవడానికి కారణం అదేనా.. ఎందుకో క్లారిటీ ఇచ్చేశారు!
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.