although-it-is-bitter-to-eat-it-is-very-good-for-health-in-telugu
Health tips : తింటే చేదుగా ఉండే ఆ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే చాలా మంది వాటిని తినేందుకు మాత్రం ఎక్కువగా ఇష్టపడరు. వీటిలో పోషకాలు అధికంగా ఉండటమే కాకుండా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాంటి ఆహారాలను పురాతన కాలం నుండి చాలామంది ఆహారంగా తీసుకుంటూ వస్తున్నారు. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి తెలిసినంతగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి తెలియదు. దీనివల్ల వాటిని తినేందుకు ఇష్టం చూపించడం లేదు. చేదుగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని రకాల పదార్థాల గురించి తెలుసుకుందాం..
గ్రీన్ టీ : ఆరోగ్యానికి గ్రీన్ టీ వల్ల అనేక లాభాలున్నాయి. రుచికి చేదుగా ఉన్నప్పటికీ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల బరువు తగ్గిపోతారు. రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దుర్వాసన,దంతక్షయం వివిధ రకాల చిగుళ్ల వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాని గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తొలగిస్తాయి. గ్రీన్ టీ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.
కాకరకాయ : తినడానికి చేదుగా ఉండే కూరగాయ. ఇది శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ ఎ,సి,పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో కాకరకాయ ముందుంటుంది. కాలిన గాయలను మాన్పడం లో కాకరకాయ లోని గుణాలు అద్భుతంగా ఉపకరిస్తాయి.
బచ్చలి కూర : దీనిలో విటమిన్ ఇ,ఎ,కె మరియు సి పుష్కలంగా ఉంటాయి. దీంతో కంటి చూపు మెరుగుపడుతుంది. గర్భిణీలు దీన్ని తింటే ఎన్నో పోషకాలు లభిస్తాయి. దీంతో బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. బచ్చలి కూర లో ఉండే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ తో పోరాడటానికి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.
మెంతులు : వీటిలో పోషకాలు పీచు పదార్థాలు ఇనుము, విటమిన్-సి, బి1,బి2, కాల్షియంలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఖనిజాలు, విటమిన్లు,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. మహిళల్లో పాల ఉత్పత్తి పెరగడానికి కూడా మెంతులు చాలా సహాయపడతాయి. మెంతులను నానబెట్టి ఆ నీటిని జుట్టుకు మసాజ్ చేస్తే జుట్టుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
Read Also : Grey Hair Problems Solution : ఇలా చేస్తే తెల్లజుట్టు సమస్యలే ఉండవు..
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.