Ramcharan RC15: ఆర్సీ15 సినిమా ఫొటోలు లీక్, రామ్ చరణ్ కు భార్యగా అంజలి!

Ramcharan RC15: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆర్సీ15 గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన కియారా అద్వానీ నటించబోతున్నారు. అలాగే శ్రీకాంత్, అంజలి, జయరామ్, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

ప్రస్తుతం రామ్ చరణ్, అంజలిపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ మరో వారం పాటు అక్కడి లోకేషన్స్ లోనే సాగుతుందట. అయితే ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాలు సినిమాలో ఫ్లాష్ బాక్ ఎపిసోడ్ లో వస్తాయని తెలుస్తోంది.

Advertisement

1930 కాలం నేపథ్యంలో ఈ సీన్స్ లో రామ్ చరణ్, అంజరి భార్యాభర్తలుగా కనిపిస్తారనే ప్రచారం వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా నెట్టింట లీక్ అయ్యాయి. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం.

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel