Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవి మాధవ కొత్త కారులో ఆదిత్య దగ్గరికి వచ్చి వెళ్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో మాధవ కొత్త కారులో దేవిని అలా కారులో బయటికి తీసుకుని వెళ్ళి తిప్పుతూ ఉంటాడు. ఆ తర్వాత మాధవ, దేవికి ఐస్ క్రీమ్ ఇచ్చి పక్కకు వెళ్లి మొబైల్ ఫోన్లో రాధ నెంబర్ ను స్వీట్ హార్ట్ అని సేవ్ చేసుకుని ఉంటాడు. అప్పుడు మాధవ తన మనసులో నీ నెంబర్ నా దగ్గర ఉంది రాధ. అంతేకాకుండా నువ్వు ఆదిత్యతో ఏం మాట్లాడుతున్నావో నాకు తెలిసిపోతోంది.
ఎందుకంటే నీ ఫోన్ నేను ట్రాప్ చేయించాను అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు ఆదిత్య దేవిని తలుచుకొని ఎప్పుడు దేవికి దగ్గర అవుతాను అని బాధపడుతూ ఉంటాడు. అయితే కూతురు దూరంగా ఉన్నా కూడా బాధ్యతలు నావే అనుకున్న ఆదిత్య ఎలా అయినా దేవుని కలెక్టర్ చేయాలి అనుకొని ఇంకా మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటాడు.
ఆ తర్వాత అదే విషయాన్ని ఈ వెంటనే రుక్మిణికి చెప్పాలి అని రుక్మిణి కి ఫోన్ చేయడంతో, రుక్మిణి ఫోన్ ట్రాప్ చేయడం వల్ల ఆ ఫోన్ మాధవకు కూడా వెళుతుంది. ఇక ఆదిత్య,రాధ ఇద్దరు ఫోన్లో మాట్లాడుతూ దేవిని ఎలా అయినా కలెక్టర్ చేయాలి అందుకు ఇంకా పెద్ద స్కూల్లో వేయాలి అని మాట్లాడుతూ ఉండగా వారి మాటలు విని షాక్ అవుతాడు మాధవ.
వారి మాటలు విన్న మాధవ దేవి విషయంలో మరొక ప్లాన్ చేస్తాడు. దేవి ఇంటికి వచ్చిన తర్వాత రాధ,దేవి తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత మాధవ రాధ తో మాట్లాడుతూ ఉండగా రాధ అతనిపై కోపడుతూ సీరియస్ అవుతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే మాధవ దేవిని ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి తీసుకొని వెళ్లి అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కలెక్టర్లు అవుతాడు అని చెబుతాడు.
అప్పుడు దేవి అక్కని కూడా ఇక్కడే జాయిన్ చేయి నాన్న అని మాధవకు చెబుతుంది. మరొకవైపు రాధ గుడికి వెళ్లి తన అత్తయ్య గారి వాయనం తిరిగి ఇవ్వాలి అని పూజారికి ఇస్తుంది. అప్పుడు పూజారి దేవుడమ్మని పిలిపించి ఆ వాయనం అందించడంతో దేవుడమ్మ అది తన కోడలు రుక్మిణి ఇచ్చింది అని ఆలోచన చేస్తూ ఉంటుంది.
మరొకవైపు పిల్లలు ఆడుకుంటూ ఉండగా రాధ అక్కడికి రావడంతో వెంటనే దేవి అమ్మ ఈరోజు నాయనా కొత్త స్కూల్లో జాయిన్ చేశాడు అని చెప్పడంతో రాధ షాక్ అవుతుంది. అప్పుడు రాధ దేవి తో మాట్లాడుతూ నేను చెప్పే వరకు స్కూల్ కి వెళ్లొద్దు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.