Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మహేంద్ర ను చూడ్డానికి వచ్చిన దేవయాని.. మహేంద్ర పై ప్రేమను చూపించినట్టుగా తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక మహేంద్రను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. దాంతో మహేంద్ర ను దేవయాని ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతారు.
ఆ తర్వాత మహేంద్ర దిగడానికి సహాయ పడుతున్న జగతిని.. రిషి చూసి మా డాడ్ ను నేను చూసుకోగలను అని అంటాడు. ఆ మాటకు జగతికి ఏం చేయాలో అర్థం కాక మనసులో ఎంతో బాధ పడుతుంది. అలా మహేంద్రను లోపలకు తీసుకు వస్తూ ఉండగా దేవయాని దిష్టి తీస్తూ.. “ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, దిక్కు మాలిన వాళ్ళ దిష్టి” అంటూ జగతికి వినపడేలా గట్టిగా అంటుంది.
ఇక దాంతో జగతి మనసులో మరింత బాధ పడుతుంది. ఇక జగతి బయటే ఉండి కంట కన్నీరు పెడుతుంది. అది చూసిన మహేంద్ర ఈ గడప దాటి లోపలికి ఎప్పుడు వస్తావు జగతి అని మనసులో అనుకున్నాడు.
ఇక బయట ఉన్న జగతి, వసు ల దగ్గరకి వచ్చి వారిని ఇంటి లోపలకి పిలవకుండా రిషి వాళ్ల దగ్గరకి వచ్చి.. మా డాడ్ ప్రాణాలతో ఉండడానికి మీరే కారణం అని చేతులెత్తి దండం పెట్టి వాళ్ళని ఇంటిదగ్గర డ్రాప్ చేసి రమ్మని గౌతమ్ కి చెబుతాడు. ఆ తరువాత దేవయాని వాళ్ళిద్దరు ఇంటి ముందు ఉండగానే తలుపులు మూసేస్తుంది. ఇక జగతి, వసులు వెళ్తూ తమకు జరిగిన అవమానం గురించి మాట్లాడుకుంటూ..
“ఆ ఇంట్లోకి వెళ్లాలంటే తలుపులు మాత్రమే కాదు వాళ్ల మనసులు కూడా తెరుచుకునే ఉండాలి ” అని జగతి అంటుంది. ఇక అదే క్రమంలో జగతి “గౌరవంగా పిలిచిన రోజే ఇంటి గడప తొక్కుతాను.. ఏమో.. వసు అసలు వెళతానో లేదో.. లేదంటే ఇలానే ఒంటరిగా రాలిపోయి అనాధ శవంలా కాటికి వెళతాను” అని అంటుంది. అది విన్న వసుధర చాలా బాధపడుతుంది.
Read Also : Guppedantha Manasu: మహేంద్ర కోసం దేవయాని ఇంటికి వెళ్ళిన జగతి.. చివరికి ఏం జరిగిందంటే?
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.