Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అనసూయ దంపతులు ఇద్దరు కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో అనసూయ దంపతులు బయట కూర్చుని ఉండగా ఇంతలో బ్యాంకు మేనేజర్ రావడంతో ఇంట్లోకి పిలుచుకొని వెళ్లి తులసిని పిలుస్తారు. అప్పుడు తులసి తో మాట్లాడుతూ మీరు బ్యాంకు లోన్ కోసం అప్లై చేస్తున్నారు కదా మీకు మేము ఇవ్వడానికి వచ్చాము అని అనడంతో తులసి అనుమాన పడుతుంది. ఈ మధ్యకాలంలో బ్యాంకు లోన్ ఇవ్వడానికి ఇంటికి కూడా వస్తున్నారా అనగా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉండటంతో వెంటనే వాళ్ళు సామ్రాట్ మనుషులు అని తులసి పసిగడుతుంది.
ఆ తర్వాత వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పి అక్కడి నుండి పంపిస్తుంది తులసి. మరొకవైపు సామ్రాట్ బ్యాంకు మేనేజర్ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వల్ల బాబాయ్ వచ్చి సామ్రాట్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ కాల్ రావడంతో చెప్పండి మేనేజర్ గారు పని అయిపోయిందా అని అనగా వెంటనే తులసి మాట్లాడుతూ పని పూర్తి అవ్వలేదు అనడంతో సామ్రాట్ ఆశ్చర్యపోతాడు.
ఆ తర్వాత తులసీ తన స్టైల్ లో సామ్రాట్ కి తగిన విధంగా బుద్ధి చెబుతూ ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి సార్ అని చెబుతుంది. ఆ తర్వాత సామ్రాట్ ఈవిడ ఏంటి బాబాయ్ ఎంతోమంది బ్యాంకు లోన్ కోసం క్యూలు కడుతుంటే బ్యాంకు మేనేజర్లనే ఇంటికి పంపిస్తే వద్దు అని అంటుంది అంటూ తులసి గురించి మాట్లాడుతూ తులసి ప్రవర్తన తో ఆశ్చర్యపోతాడు సోమ్రాట్. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ ని చూసి నవ్వుతూ ఉంటాడు.
ఇంతలోనే అక్కడికి హనీ చక్కగా రెడీ అయ్యి రావడంతో సామ్రాట్ నా కూతురికి నా దిష్టి తగిలేలా ఉంది అని ముద్దాడుతూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఈరోజు ఏమైనా పండుగ ఉందా అని అడగగా, వెంటనే అని ఉంది నేను ఈరోజు సంగీతం నేర్చుకోవడానికి వెళ్తున్నాను అనడంతో సామ్రాట్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు వెంటనే సామ్రాట్ ఎక్కడికి వెళ్తున్నావు అని అనగా తులసి ఆంటీ దగ్గరికి అనడంతో సరే అని అంటాడు.
సరే నేను డ్రాప్ చేస్తాను కదా అనగా అప్పుడు హనీ నువ్వు వద్దు తాతయ్యతో వెళ్తాను అని చెప్పి అతను తీసుకొని తులసి ఇంటికి వెళుతుంది. మరొకవైపు తులసి పిల్లలకు సంగీతం నేర్పిస్తూ ఉండగా ఇంతలోనే హనీ వాళ్ళ తాతయ్య తులసి ఇంటికి వెళ్తారు. అప్పుడు హనీను చూసి మళ్లీ సామ్రాట్ ఏం గొడవ చేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది తులసి. అప్పుడు సామ్రాట్ గురించి కొద్దిసేపు వాళ్ళ బాబాయ్ తో మాట్లాడుతూ ఉంటుంది తులసి.
ఆ తరువాత హనీ నేను మీ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను మా నాన్న ఇక్కడికి రావద్దు అని చెప్పాను. ఎలా అయినా నాకు సంగీతం నేర్పించండి ఆంటీ అంటూ తులసిని బ్రతిమలాడుతుంది. హనీ ఎక్కువగా బ్రతిమలాడుతూ ఉండడంతో తులసి సరే అని అంటుంది. హనీ డైరీ మిల్క్ చాక్లెట్ ని తులసికి గురుదక్షిణగా ఇవ్వడంతో తులసి హత్తుకొని ఆనంద పడుతూ ఉంటుంది. ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ నుంచి ఎటువంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను అని హామీ ఇస్తాడు.
మరొకవైపు ప్రేమ్ శృతి కోసం రోడ్ల వెంబడి వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. శృతి కూడా ప్రేమ్ కోసం ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటుంది. ఆ తర్వాత తులసి, అభి కి ఫోన్ చేయడంతో అభి వెటకారంగా మాట్లాడుతాడు. అంతేకాకుండా నువ్వు కోరుకున్న విధంగా నీ కోడల్ని కూడా నీ ఇంటికి రప్పించుకున్నావు కదా అంటూ అంకిత గురించి తులసి గురించి తప్పుగా అర్థం చేసుకుంటాడు. అప్పుడు తులసి ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా అవి తన మాట తనదే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు.
ఇక చివరిగా తులసి పండుగకు ఇంటికిరా అభి అప్పుడు అంకితతో కలిసి మాట్లాడు మీ పరిష్కరించుకోండి నేను మీ సమస్య లోకి తల దూర్చును అని అంటుంది. ఆ తర్వాత తులసి ఫోన్ కట్ చేయడంతో అభి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి గాయత్రి వస్తుంది. మీ అమ్మ కాల్ చేసిందా అనగా అవును అనడంతో ఎందుకు కాల్ చేసింది అని గాయత్రి ప్రశ్నించగా పండుగకు రమ్మని చెబుతోంది గాయత్రి సరే లగేజ్ తీసుకుని బయలుదేరు అని అంటుంది.
అక్కడికి వెళ్లి అంకితని బుజ్జగించి ప్రేమతో మాట్లాడి మళ్ళీ ఇక్కడికి తీసుకొని రా అని అవి లేనిపోని ఐడియాలు ఇచ్చి రెచ్చగొడుతుంది గాయత్రి. ఒక వైపు నందు లాస్య వాళ్ళ కంపెనీకి ఎక్కువమంది ఇంటర్వ్యూ కోసం రావడంతో తెగ సంతోషపడుతూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా తులసి అనుకోకుండా నందు వాళ్లు పని చేస్తున్న కంపెనీకి పెట్టుబడి కోసం వెళ్తుంది. అదే అదునుగా భావించిన నందు,లాస్య ఇద్దరు తులసీ దగ్గర ఫోజులు కొడుతూ గర్వంగా మాట్లాడుతూ ఉంటారు.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.