Rashmika: ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు నటి రష్మిక. ఇలా ప్రస్తుతం ఏమి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సీతారామం అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసి. ఇందులో ఈమె డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో కలిసి జోడిగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్ట్ ఐదవ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బిత్తిరి సత్తి నిర్వహించిన ఇంటర్వ్యూలో రష్మిక పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె అచ్చం బిత్తిరి సత్తి లాగా మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. ఇక బిత్తిరి సత్తి మాట్లాడుతూ మిమ్మల్ని మందన్న అని పిలవడానికి చాలా కష్టంగా ఉంది ఎలా పిలవాలి అని ప్రశ్నించగా రష్మిక సమాధానం చెబుతూ రష్, రోజ్, క్రష్ అని పిలువు అంది. అందరూ నిన్ను క్రష్మిక అని పిలుస్తారట కదా అని ప్రశ్నించగా అవును బన్నీ సార్ తనకు ఆ పేరు పెట్టారని రష్మిక తెలిపారు.
ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె బిత్తిరి సత్తితో కలిసి ఎంతో సరదాగా ముచ్చటించారు. బిత్తిరి సత్తి తన మాటలతో రష్మికను పెద్ద ఎత్తున నవ్వించారు.ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను పలు భాషలలో సినిమాలు చేస్తున్నానని ప్రతిరోజు సాయంత్రం ఒక ట్యూటర్ నీ పెట్టుకుని ఆ భాష నేర్చుకుంటున్నానని ఈమె తెలిపారు. ఇక సీతారామం సినిమా గురించి మాట్లాడుతూ ఇదొక అందమైన ప్రేమ కథ చిత్రం అని తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఇకపోతే ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో డైరెక్టర్ గారు మైక్ లో చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు.ఆయన అలా అరవగానే నేను తన దగ్గరకు వెళ్లి సార్ నా హార్ట్ కొంచెం వీక్ కాస్త నెమ్మదిగా అరవండి అంటూ చెప్పు కొచ్చానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇకపోతే రోజుకు 24 గంటలు సరిపోతున్నాయా అని బిత్తిరి సత్తి ప్రశ్నించగా తనకు 24 గంటలు సరిపోవటం లేదని రోజు 36 గంటలు కావాలి అంటూ సరదాగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం రష్మిక కు సంబంధించిన ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.