Devatha july 4 today episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవి,చిన్మయి ఇద్దరు కలసి రామ్మూర్తి దంపతులతో సరదాగా ఆడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో దేవి మాధవ దగ్గరికి రావడంతో మాధవ చేతి పై ఉన్న పచ్చబొట్టును చూసి దాని గురించి వివరాలు అడుగుతుంది దేవి. ఇంతలోనే రాగా అక్కడికి చిన్మయిను తీసుకొని వస్తుంది. అప్పుడు దేవి ఎలా వేస్తారు దీనిని అని అనగా మాధవ సూదితో పొడుస్తారు అనడంతో నొప్పి రాలేదా అంటూ బాధగా అడుగుతుంది దేవి. అప్పుడు మాధవ దొంగ ప్రేమ చూపిస్తూ నిన్ను తలచుకున్నాను అందుకే నొప్పి రాలేదు అంటూ ఎమోషనల్ గా డైలాగులు కొడతాడు. అప్పుడు రాద స్కూల్ కి వెళ్దాం పదండి అని అక్కడ నుంచి పిల్లలను తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత దేవి మాధవ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ పచ్చబొట్టు పడిపించుకోవాలని అనుకుంటుంది. ఆ తర్వాత పచ్చబొట్టు పొడిగించుకోవడానికి వెళ్లగా ఇంతలో భాగ్యమ్మ వచ్చి అడ్డుపడి వద్దు అని చెప్పి స్కూల్ లోకి పంపిస్తుంది. ఆ తరువాత రాధ,ఆదిత్యను కలిసి బాగా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతూ ఉంటుంది.
అప్పుడు ఆదిత్య ఎందుకు ఇంటికి రావడం లేదు అని ప్రశ్నించగా.. దేవిని నీ దగ్గరకు పంపిస్తే నేను కూడా రావాలి అప్పుడు చిన్మయి ఒంటరి అవుతుంది అందువల్లే మాధవ నన్ను పంపించడం లేదు అని అనగా వెంటనే ఆదిత్య తన కూతురి కోసం నా బిడ్డను నాకు దూరం చేస్తాడా అని అంటాడు.
అమ్మ మీద అంత కోపం ఉన్నప్పుడు ఎందుకు ఇంటికి రాలేకపోతున్నావు అని అనగా వెంటనే రాధ ఇంటికి వస్తే అత్తమ్మ కు పది సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు అన్నీ చెప్పాలి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాను ఎలా ఉన్నాను అన్న విషయాల గురించి చెప్పాలి కదా అని బాధపడుతుంది. ఆ తర్వాత మాధవ దేవికి రోజురోజుకీ దగ్గర అవుతున్నాడు ఎలా అయినా మీరు దేవిని దగ్గరికి చేసుకోవాలి అని ఆదిత్య కు చెబుతుంది.
అప్పుడు ఆదిత్య ఎలా అయినా దేవుని దగ్గర చేసుకొని ఈ మీ ఇద్దరినీ ఇంటికి తీసుకొని వెళ్తాను అని రాధకు మాట ఇస్తాడు. మరొకవైపు కమల సత్యతో బిడ్డ పుట్టే తేది గురించి చెప్పి ఆలోపు అమెరికాకు వెళ్లి వచ్చేస్తావు కదా అని అనడంతో సత్యాలోపు వచ్చేస్తాను అని ధైర్యం చెబుతుంది.
ఆ తర్వాత ఆదిత్య ఇంటికి ఊరి జనాలు రావడంతో ఆఫీస్ దగ్గర కలవమని సలహా ఇస్తాడు. ఇంతలోనే దేవి అక్కడికి రావడంతో ఆ కారులో మాధవ ఉంటాడు. అనధికారు తన తండ్రి పెద్దయ్యాక కొనిస్తాడంట అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది దేవి.
మరొకవైపు రాధ ఫోన్ కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది.అప్పుడు రామ్మూర్తి దంపతులు ఫోన్ నెంబర్ అడగగా తెలియదు అనటంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాదా వంట గదిలో మొత్తం వెతకగా అక్కడ చివరికి ఫోన్ దొరకడంతో సంతోష పడుతూ ఉంటుంది.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.