Kacha Badam Singer : ‘కచ్చా బాదమ్‌’ సింగర్‌కు కారు ప్రమాదం.. ఛాతికి గాయాలు..!

Kacha Badam Singer : కచ్చా బాదమ్ పాట.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఈ పాటే వినిపిస్తోంది. వరల్డ్ వైడ్ కచ్చా బాదమ్ మానియా నడుస్తోంది. అంతగా పాపులర్ అయింది ఈ పాట.. బైకుపై వీధి వీధి తిరుగుతూ పచ్చి పల్లీలు అమ్ముకునే వ్యక్తి ఈ పాటను రాశాడు. అతడే.. పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ కు చెందిన భుబన్ బద్యాకర్.. సోషల్ మీడియా సెన్సేషన్ అయిన ఈ బద్యాకర్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. తన కారు డ్రైవ్ చేస్తుండగా ఛాతికి స్వల్ప గాయాలయ్యాయి.

ఇటీవలే సెకండ్ కారును కొనుగోలు చేసిన బద్యాకర్.. కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ప్రమాదం జరిగింది. వెంటనే ఓ సూపర్ స్పెషల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కచ్చా బాదమ్ సింగర్ బద్యాకర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement
Kacha Badam Singer Bhuban Dadyakar Injured in Car Accident

బెంగాలీలో పాడుకునే ఈ పాటకు ట్యూన్ కట్టిన బద్యాకర్.. పల్లీలు అమ్మేటప్పుడు పాడుతుంటాడు. అలా పాడుతుండగా ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అప్పటినుంచి ఎక్కడ చూసినా.. కచ్చా బాదమ్ సాంగ్ చక్కర్లు కొడుతోంది.

ఈ కచ్చా బాదమ్ పాటతో రాత్రికిరాత్రే.. సెన్సెషనల్ స్టార్ అయాడు చిరు వ్యాపారి భుబన్ బద్యాకర్‌.. ఇకపై పల్లీలు అమ్మడం మానేస్తానని చెప్పాడు. ఇటీవల చాలా ఆల్బమ్స్ లో కూడా తన పాటను పాడి మరింత ఆకట్టుకుంటున్నాడు. బద్యాకర్ క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. బాలీవుడ్ ఇతర ప్రైవేట్ ఆల్బమ్ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. టీవీ షోలలో కూడా కనిపిస్తూ తన పాటతో అందరిని అలరిస్తున్నాడు బద్యాకర్..

Advertisement

Read Also : Jabardasth Varsha: వర్ష అసలు అమ్మాయేనా? అంటూ వర్ష పరువు తీసిన ఇమ్మాన్యుయేల్ తల్లి…!

Advertisement
Tufan9 Telugu News

Tufan9 Telugu News providing All Categories of Content from all over world

Recent Posts

Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!

Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…

13 hours ago

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

1 week ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

1 week ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

1 week ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

1 week ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

This website uses cookies.