Indraja Shocking comments on her marriage life
Indraja Comments : తెలుగు సినీపరిశ్రమలో హీరోయిన్ ఇంద్రజ అంటే పరిచయం అక్కర్లేదు. అప్పట్లోనే ఆమె ఎంతోమంది స్టార్ హీరోలతో నటించింది. కామెడీ స్టార్ అలీ వంటి ఎందరో కమెడియన్లతో కూడా నటించింది. తన నటనతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. సినీ కెరీర్ ఆరంభంలోనే సూపర్ డూపర్ హిట్ మూవీ యమలీలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనేక తెలుగు సినిమాల్లో నటించిన ఇంద్రజ టాలీవుడ్‌లో అప్పట్లో టాప్ హీరోయిన్ రేంజ్ లో పేరు సంపాదించింది. సీనియర్ హీరోలతోనే కాదు.. జూనియర్ హీరోలతోనూ ఇంద్రజ నటించింది. కమెడియన్లు హీరోలతోనూ జతకట్టి అనేక సినిమాల్లోనూ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఇంద్రజ..
కేవలం 2 సంవత్సరాల్లో 30 సినిమాల్లో నటించి ఇంద్రజ రికార్డు సృష్టించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళనం, కన్నడ, మలయాళంలోనూ అనేక సినిమాలు చేసింది. ప్రస్తుతం జబర్దస్త్ షోకు జడ్జీగా చేస్తోంది ఇంద్రజ. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఇతర షోలకూ ఇంద్రజ జడ్జీగా వ్యవహరిస్తోంది.
అయితే తన భర్త గురించి కూడా పలు విషయాలు వెల్లడించింది ఇంద్రజ. తన భర్త వ్యాపార వేత్ కాదని, తను కూడా ఇండస్ట్రీలోని వ్యక్తేనని చెప్పింది. తను తమిళ సినిమాలతో పాటు సీరియళ్లు కూడా చేశాడని ఇంద్రజ వెల్లడించింది. వారిద్దరిది లవ్ మ్యారేజ్ అని, రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. అయితే తనకు పెళ్లి అయినట్లు మొదట్లో చాలా మందికి తెలియదని.. తనకు అమ్మాయి పుట్టిన తర్వాతే చాలా మందికి తనకు వివాహం జరిగినట్లు తెలిసిందని వెల్లడించారు ఇంద్రజ. పిల్లలు పెద్ద వాళ్లు అయ్యాక తిరిగి ఇండస్ట్రీకి వచ్చేందుకు ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పలేదని తెలిపారు ఇంద్రజ.
Read Also : Indraja comments: సుడిగాలి సుధీర్ ను మిస్ అవుతున్నానంటూ ఇంద్రజ కామెంట్లు..!
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.