Ileana D’Cruz Real Photo : ఇలియానా… చిట్టి ఇలియానా.. అనగానే ఆమె చిట్టి నడుము గుర్తుకొస్తుంది యూత్‌కి.. దేవదాసు సినిమాలో ఎంతో నాజుగ్గా కనిపించిన అమ్మడూ పోకరితో కుర్రకారును ఆకట్టుకుంది. అప్పటినుంచి వెనక్కి చూసుకోకుండా ఎన్నో సినిమాల్లో వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది. సన్నగా ఉండే ఇలియానా కాస్తా బొద్దుగా మారిపోవడంతో సినిమా అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వరుస ఫొటోలను పోస్టు చేస్తోంది.
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇలియానా రవితేజతో కలిసి అమర్ అక్బర్ ఆంటోని మూవీలో నటించింది. అంతకుముందే కిక్ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఈ సినిమా హిట్ కాలేదు. దాంతో మళ్లీ ఇలియానా సినిమాలు చేయడం లేదు. అయినా సోషల్ మీడియాలో తన లేటె్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది ఇలియానా..
ఇలియానా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్.. బొద్దుగా ఉండే తన రియల్ ఫొటోను షేర్ చేసేసింది. అసలు తన ఫొటోను ఎడిట్ చేయకుండా అలానే పోస్ట్ చేసింది. తన ఫోన్‌లో సన్నగా కనిపించేలా ఎడిట్ చేసే అన్ని యాప్స్ తాను డిలీట్ చేసినట్లు ఇలియానా అంటోంది.
సన్నగా చాలా అందంగా కనిపించేందుకు.. శరీరం ఫిజిక్ మార్చే యాప్స్ వాడటం మానేశాను.. ఆ యాప్స్ అన్నింటిని డిలీట్ చేసేశాను. ఎంతో గర్వపడుతున్నాను. ఇప్పుడు ప్రతి అంగుళం.. ఇదే నా రియల్ శరీరాకృతి. అందరినీ హగ్ చేసుకోగలను’ అంటూ క్యాప్షన్ పెట్టింది ఈ గోవా బ్యూటీ… నువ్వు అందంగా ఉన్నావు.. అనే హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేసింది. ఇలియానా పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలియానా చేసిన డేరింగ్ డిసెషన్‌కు అందరూ ఎంతో బోల్డ్ అంటూ షాక్ అవుతున్నారు.
Read Also : Bride Dance Viral : బుల్లెట్ బండి పెళ్లికూతురు పాటను మరిపించిన మరో కొత్త పెళ్లికూతురు.. వీడియో చూశారా?
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.