Potato Soap: మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో బంగాళదుంప కూడా ఒకటి. వీటితో మనం అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వీటితో చేసే ఏ పదార్థాలు అయినా చాలా రుచిగా ఉంటటాయి. చాలా మంది బంగాళదుంప వంటకాలను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటి వల్ల మన శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ఆరోగ్యాన్నే కాదు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బంగాళదుంప ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మంపై పేరుకుపోయిన నలుపును తొలగించి చర్మాన్ని అందంగా, కాంతివంతంగా చేయడంలో కూడా బంగాళదుంప మనకు చాలా బాగా ఉపయోగ పడుతుంది. అయితే బంగాళ దుంపతో సబ్బును తయారు చేసుకోవచ్చు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక పెద్ద బంగాళదుంపను తీస్కొని దాన్ని ముక్కలుగా చేస్కోవాలి. ఈ ముక్కలను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన బంగాళదుంప మిశ్రమాన్ని వస్త్రంలో లేదా జల్లిగంటెలో వేసి రసాన్ని తురుముకోవాలి. తర్వాత మనం స్నానం చేయడానికి ఉపయోగించే సబ్బును తీస్కోవాలి. రసాయనాలు తక్కువగా ఉన్న సబ్బును తీస్కోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ సబ్బును మనం కూరయాగలను తురిమినట్లుగా చిన్న చేస్కొని ఇంతకు ముందు తయారు చేసి పెట్టకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కలబంద గుజ్జు వేయాలి. టీ స్పూన్ బాదం నూనె వేయాలి.
ఈ మిశ్రమం ఉన్న గిన్నెను.. మరుగుతున్న నీరు ఉన్న మరో గిన్నెలో వేసి ఐదు నిమిషాలు ఉంచుకోవాలి. తరచుగా కలుపుతూ ఉండాలి. పూర్తిగా కలిసాక మనకు నచ్చిన ఆకృతిలో అచ్చు వేస్కోవాలి. దీన్ని 7 గంటల వరకు ఆరనివ్వాలి. ఇలా తయారు చేసుకున్న బంగాళదుంప సబ్బు వల్ల ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. మిలమిలా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
Ginger Benefits : కీళ్లనొప్పులు, దగ్గు, జలుబు, కడుపునొప్పి, మోషన్ సిక్‌నెస్, వికారం, అజీర్ణం వంటి సందర్భాల్లో అల్లంను ఎక్కువగా…
Vasantha Panchami 2025 : వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు…
This website uses cookies.