Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి, వసుధార ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్లో వసు, రిషి కార్లో వెళ్తుండగా దేవయానికి ఫోన్ చేయడంతో నాన్న రిషి నువ్వు వసుధారతో కలిసి వెళ్తున్నావా అని అడగగా అవును పెద్దమ్మ అని అంటాడు. సరే నాన్న వెంటనే నువ్వు తిరిగి వచ్చేసేయ్ అనడంతో సారీ పెద్దమ్మ వసుధార ఒకదాన్ని పంపించలేను నేను రాలేను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దాంతో దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా ఆ జగతి ప్లాను రిషిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు మీ సంగతి చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. మరొకవైపు వసుధార రిషి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు.
ఆ తర్వాత దేవయాని మహేంద్ర, జగతి లపై సీరియస్ అవుతూ రిషి వెళ్తున్నప్పుడు నాకు ఒక్క మాట చెప్పాలి కదా మీ అంతట మీరు నిర్ణయం తీసుకుంటారా ఇంట్లో పెద్దదాన్ని ఒక్కదాన్ని ఉన్నాను కదా అని అంటుంది. అప్పుడు జగతి మాట్లాడడంతో నువ్వు మధ్యలో మాట్లాడకు జగతి నీకు రిషి పై ఎటువంటి హక్కు లేదు జగతి ఆశ్చర్య పోతుంది. నేను మహేంద్ర తో మాట్లాడుతున్నాను అని అంటుంది. వసుధార వాళ్ళ నాన్న గురించి మీకు తెలుసు రిషిని అక్కడ అవమానిస్తే మీకు సంతోషంగా ఉంటుందా అని అంటుంది దేవయాని. అప్పుడు వెంటనే మహేంద్ర వదిన గారు రిషి చిన్నపిల్లవాడు కాదు అది తన పర్సనల్ మేటర్ మనం ఎంతవరకు జోక్యం చేసుకోవాలో అంతవరకు మాత్రమే ఉండాలి అనగా ఈ నీతి మాటలు ఏవో రిషికి చెప్పి ఉంటే ఆగిపోయేవాడు మహేంద్ర అని అంటుంది.
సరే బయలుదేరాం పదండి అనగా ఎక్కడికి వదినగారు మనం ఇప్పుడు అక్కడికి వెళ్లడం అంత మంచిది కాదు అని అంటాడు మహేంద్ర. అప్పుడు దేవయాని మహేంద్ర పై సీరియస్ అవుతుంది వెంటనే ఫణీంద్ర రిషి దగ్గర నుంచి మనం ఫోన్ వచ్చేవరకు మనం వెళ్లేదే లేదు అని తెగేసి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో దేవయానికి కోపంతో రగిలిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జగతీ దంపతులు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు వసుధార, రిషి ఇద్దరు కారులో వెళ్తుండగా అప్పుడు రిషి సడన్ గా కారు ఆపడంతో ఎందుకు కారు ఆపారు సార్ అనగా కారు ఎక్కినప్పటికి చూస్తున్న ఏం మాట్లాడడం లేదు అనడంతో నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అందుకే మాటలు రావడం లేదు అని అంటుంది వసుధార.
నేను ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాను కదా వసుధార మీ ఇంట్లో వాళ్లకు నన్ను ఏమని పరిచయం చేస్తావు అని రీషి అడగడంతో మా కాలేజీ ఎండి అని పరిచయం చేస్తాను అని వసుధార చెప్పగా అంతేనా వసుధార అనడంతో ఇంకా కొన్ని చెప్తాను అవన్నీ అక్కడికి వెళ్లాక మీరే వింటారు కదా సార్ అని అంటుంది. ఇప్పుడు చెప్పాల్సిందే చెప్పకపోతే ఇక్కడి నుంచి నేను కారు కదలనివ్వను అని అంటాడు. అప్పుడు సరే సార్ నాకేం భయం లేదు నేను మిమ్మల్ని ఇలాగే చూస్తూ ఉంటాను ఎంతసేపు అయినా పర్లేదు అని అంటుంది. అప్పుడు సరే సార్ చెప్తాను కానీ ఒక పని చేయాలి. ఈ రింగ్ ఉన్న చేతికి తొడగాలి అనడంతో సరే అని రిషి వసుధార చేతికి రింగు తోడుగుతాడు.
అప్పుడు వసుధార సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ తర్వాత చేతికి రింగు తొడిగి ముద్దు పెట్టుకోవడంతో వసుధార మరింత సిగ్గుపడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు వసుధార నువ్వు మీ ఇంట్లో వాళ్లకు నన్ను ఏమని పరిచయం చేస్తావు అనడంతో అప్పుడు వసుధరావు ఒక పెన్ను తీసుకుని రిషి చెయ్యి తీసుకొని మీరు కళ్ళు మూసుకోండి సార్ నేను ఒకటి రాస్తాను అని అంటుంది. అప్పుడు రిషి చెయ్యి పై వసుధార రాసి ఇప్పుడు కళ్ళు తెరవండి సార్ అని అంటుంది.
అప్పుడు రిషి కళ్ళు తెరిచి చూడగా తనిచే తన చేతిపై రిషి సార్ మై డార్లింగ్ ప్రేమతో పొగరు అని రాసి ఉండడంతో అది చూసి రిషి సంతోష పడుతూ ఉంటాడు. వసుధార సిగ్గుపడుతూ ఉండగా రిషి వసుధర చేతులు పట్టుకుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. ఎండి అంటే మీనింగ్ మై డార్లింగ్ ఎంత బాగుందో వసుధార అని సంతోషపడుతూ ఉంటాడు. మరొకవైపు జగతి బుక్స్ చదువుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.