Karthika Deepam july 19 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్, సత్యని ఒకసారి హిమతో మాట్లాడమని చెప్పగా వెంటనే స్వప్న సీరియస్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ అన్న మాటల గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే స్వప్న అక్కడికి వచ్చి ఏమి ఆలోచిస్తున్నావు అని అడగగా నాకంటూ పర్సనల్ ఉంటాయి కదా మమ్మీ ఇలా అడగడమే తప్పు అంటూ స్వప్న పై సీరియస్ అవుతాడు నిరుపమ్. అప్పుడు అవును నేను మీ పెళ్లికి ఒప్పుకొని పెద్ద తప్పు చేశాను అంటూ హిమ ను తిడుతూ ఉండగా అప్పుడు నిరుపమ్ చిన్న దానికి పెద్ద దానికి నువ్వు హిమ ను తిట్టదు మమ్మీ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
మరొకవైపు హిమ ఒంటరిగా కూర్చుని సౌర్య అన్న మాటల గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సౌందర్య అక్కడికి వచ్చి భోజనం తినడానికి రమ్మని ఎదుట బ్రతిమలాడినా కూడా హిమ ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుంచి సౌందర్యని పంపిస్తుంది. మరొకవైపు ఆనంద్ రావు, సౌర్యాని భోజనానికి పిలవగా సౌర్య కూడా ఆకలిగా లేదు రాను అని చెప్తుంది. దాంతో ఆనందరావు బాధపడుతూ బయటికి రావడంతో సౌందర్య కూడా బాధపడుతుంది.
ఉదయం సౌందర్య, ఆనంద్ రావ్ లు వృద్ధాశ్రమానికి వెళ్లాలి అని ప్లాన్ చేస్తారు. అందుకోసం ఇద్దరూ బాగా నటించాలి అంటూ కొద్దిసేపు కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే హిమ,సౌర్య రావడంతో ఇద్దరు నటనను మొదలుపెడతారు. ఇక అప్పుడు సౌందర్య వెళ్ళొస్తాను హిమ అని అనగా ఎక్కడికి అని అనడంతో వృద్ధాశ్రమానికి అనడంతో వారిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు సౌందర్య ఆనంద్ రావ్ లు బాధపడుతున్నట్లు యాక్ట్ చేస్తారు. అప్పుడు హిమ,సౌర్య ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు అని చెప్పినా కూడా వెళ్తూ ఉండగా వెంటనే సౌర్య ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదు నాకు ఆకలిగా ఉంది వెళ్దాం పదండి అని వారిని లోపలికి పిలుచుకొని వెళ్తుంది. మరొకవైపు శోభ,నిరుపమ్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి డబ్బులు కట్టకపోతే హాస్పిటల్స్ సీజ్ చేస్తాం అనడంతో శోభ భయపడుతూ ఉంటుంది.
అప్పుడు శోభ, స్వప్న కు కాల్ చేసి నా విషయం ఏం చేశారు ఆంటీ అని అడగగా.. నీ గురించి ఆలోచిస్తున్నాను శోభ నిరుపమ్ ఎందుకో కాస్త డల్ గా ఉన్నాడు అని చెప్పి ముఖం మీద ఫోన్ కట్ చేస్తుంది స్వప్న. మరొకవైపు ఆనందరావు, సౌందర్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఇంద్రమ్మ వస్తుంది. అప్పుడు సౌర్యనీ కంటికి రెప్పలా కాపాడినందుకు ఇంద్రమ్మ కృతజ్ఞతలు తెలుపుతారు సౌందర్య దంపతులు. ఆ తర్వాత జ్వాలా అక్కడికి వచ్చి ఇంద్రమ్మ ప్రేమతో మాట్లాడిస్తూ బోనాలు పండుగకు రమ్మని చెప్పి ఆహ్వానిస్తుంది. అప్పుడు సౌందర్య వాళ్ళను హిమని కూడా రమ్మని పిలవగా వెంటనే సౌర్య వాళ్లు ఎందుకు వస్తారు పిన్ని అని అనడంతో వెంటనే సౌందర్య వస్తాను అమ్మ నేను బోనం ఎత్తుకోవచ్చా అనడంతో ఇంద్రమ్మ చాలా సంతోషపడుతుంది. ఆ మాటకు సౌర్య కూడా ఆశ్చర్య పోతుంది. ఆ తర్వాత ఇంద్రమ్మ వాళ్లందర్నీ బోనాల పండుగకు రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది.
అప్పుడు సౌర్య బయట పని ఉంది అని వెళుతూ ఉండగా వెంటనే సౌందర్య ఎక్కడికి వెళ్తున్నావే బోనాల పండుగకు సంబంధించినవి కొనుక్కుని వద్దాం అని అనగా కొంతమంది వస్తే నిన్ను రాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సౌర్య. అప్పుడు సౌందర్య దంపతులు ఈ బోనాల పండుగకు నిరుపమ్,ప్రేమ్ లు కూడా ఉంటే బాగుంటుంది అని అంటారు. అప్పుడు హిమ నేను బావ వాళ్ళని పిలుస్తాను అని చెప్పి వాళ్లకు ఫోన్ చేసి రమ్మని చెబుతుంది. రేపటి ఎపిసోడ్లో సౌందర్య కుటుంబం మొత్తం కారులో బోనాల పండుగకు వెళుతూ ఉండగా అప్పుడు సౌందర్య,కార్తీక్,దీప లను కలపడానికి చేసిన ప్లాన్ ను వేసి కారును అటూ ఇటూ టర్నింగ్ తిప్పుతూ హిమ,సౌర్యలను ఒకరిపై ఒకరు పడే విధంగా చేస్తుంది.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.