Nuvvu Nenu Prema Serial July 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పద్మావతి మరియు విక్కీ లు స్టోర్ రూమ్ లో లాక్ చేయబడతారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. విక్కీ పద్మావతిని నేను చెప్పేది ఒక్కసారి విను అంటాడు. అప్పుడు పద్మావతి విక్కీ మాటలు పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్లి పోతుంది. పద్మావతి బాగా దాహం వేస్తుంది అనుకోగానే విక్కీ తాగడానికి మంచినీరు ఇస్తాడు. అప్పుడు పద్మావతి నాకు వద్దు అంటుంది. ఏంటి కోపం వస్తుందా నా ఫోన్ పగల కొట్టినట్టే ఇక్కడున్న వస్తువులన్నీ పగలగొట్టు నీకు చేతనైతే ఆ తలుపులు కూడా పగలగొట్టు అంటుంది.
పద్మావతి నేను ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అని వెళ్తుంటే విక్కీ వెళ్ళకుండా తన చేతుల్ని అడ్డు పెడతాడు. నేను చెప్పేది విన్న తర్వాత నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలి ఇది ఫిక్స్ అంటాడు. అప్పుడు పద్మావతి కూడా నువ్వు చెప్పేది వినను అంతే ముందు నేను ఇక్కడ నుండి వెళ్లిపోవాలి ఇది ఫిక్స్ అంటుంది. నీకు చేతనైతే ఆ తలుపులు తీయి అంటుంది. ఈ విక్రమాదిత్య తలుచుకుంటే చేతకానిది అంటూ ఏమీ లేదు నీకు కావాల్సింది తలుపులు తీయడమే కదా ఇప్పుడే తీస్తాను అంటూ తలుపుని గట్టిగా కొట్టి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇప్పుడైనా నేను చెప్పేది వింటావా అనగానే పద్మావతి నేను వినను నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి. అయినా నేనంటే నీకు కోపం కదా నేను చేతకాని దాన్ని కదా నా మొహం కూడా నీకు చూడాలని లేదు కదా అంటుంది.
మీరు ఎప్పటి నుండి వర్క్ పేరుతో నా మీద పగ తీర్చుకున్నారో అప్పటినుండి మీరంటే నాకు అసహ్యం నేను శ్రీనివాసుని కోసం వచ్చిన మిమ్మల్ని చూడాలని కాదు. అయినా మీ మాట నేను ఎందుకు వినాలి నేను మీ ఆఫీస్ లో ఇప్పుడు ఎంప్లాయి నీ కాదు అంటుంది. ఇక జన్మలో అంటుంది. ఇక జన్మలో నేను నీకు కనిపించను తిరుపతి పోతున్న నేను పోతే నీకు సంతోషమే కదా అంటూ విక్కీ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళి పోతుంది.
అను పద్మావతి కి ఫోన్ చేస్తుంటే పద్మావతి ఫోన్ స్విచాఫ్ వస్తుంది. అప్పుడు పద్మావతి ఇంటికి వస్తుంది. అక్క మనం మన ఇంటి కి తిరుపతి కి వెళ్దాం పదా అంటుంది. మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు అంటుంది. అప్పుడు వాళ్ల అక్క ఏమైంది అమ్మి ఎందుకు అలా ఉన్నావ్ నీకు ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అనగానే నా ఫోన్ పగిలిపోయింది అక్క అంటుంది. ఎలా పగిలింది అనగానే నన్ను ఏమీ అడగవద్దు ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటుంది.
విక్రమాదిత్య పద్మావతి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని కోపంతో ఇప్పటివరకు నా మాట ఎవరు కాదనలేదు కానీ నువ్వు నన్ను హార్ట్ చేసావ్ ముందు ముందు దాని రిజల్ట్ ఏంటో నేను నీకు చూపిస్తాను అంటాడు. పద్మావతి వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి అక్క నేను అన్న దాని గురించి ఏం ఆలోచించావు అనగానే వాళ్ళ అక్క దేని గురించి అమ్మి అంటుంది. తిరుపతికి వెళదాం అన్నాను కదా నాయనకు చెప్పి టికెట్ బుక్ చేయించావా అంటుంది.
ఏమైంది అమ్మి అసలు విషయం చెప్పకుండా తిరుపతి కి వెళ్దాం అంటున్నావ్ అని వాళ్ళ అక్క అడగగానే అప్పుడు పద్మావతి నాకు ఇక్కడ మనుషులు వాళ్ల మనస్తత్వాలు నచ్చడం లేదు అంటుంది. అప్పుడు వాళ్ళ అత్త అక్కడికి వచ్చి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అంటుంది. తిరుపతి వెళ్తున్నాం అనగానే ఓహో మీ అమ్మానాన్న లను కలిసి రెండురోజులు ఉండి వస్తారా అంటుంది. అప్పుడు పద్మావతి లేదు అత్త ఇంకా అక్కడే ఉండిపోతాం. నెల రోజులు ఉండి పోదామని వచ్చాం నెల రోజులు అయిపోయాయి కాబట్టి ఇక వెళ్తున్నాం అంటుంది.
ఏంటి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అంతేలే ఎంతైనా నేను అమ్మను కాదు కదా అత్తనే కదా ఎప్పటికైనా నన్ను విడిచిపెట్టి వెళ్లాల్సిందే కానీ ఎన్నాళ్ళు నా ఒంటరి జీవితంలో మీరు వచ్చి సంతోషాన్ని నింపారు. అంటూ వాళ్ల అత్త ఎమోషనల్ అవుతుంది. ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ఇప్పుడు వెళతాం అంటే నాకు ఎట్లనో ఉంది. అయినా నా పిచ్చి కాకపోతే బంధానికి ఎప్పుడో ఒకప్పుడు ముగింపు ఉంటుంది. అలాగే మన బంధం కూడా అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
విక్రమాదిత్య ఇంటికి వస్తాడు. అరవింద విక్కీ దగ్గరికి వెళ్లి ఏంటి నీకు కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది. ఎనీవే నీకు ఒక గుడ్ న్యూస్ అంటుంది. మాయ మన ఇంటికి వస్తుంది. మీ బావగారు చాలా తెలివిగా ఒప్పించారు. ఎన్ని రోజులు నీ గురించి ఆలోచించిన నాకే ఈ ఆలోచన రాలేదు. కానీ మీ బావ గారు టైం కి వచ్చి అన్ని సెట్ చేశారు అంటుంది. మాయ కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉండబోతుంది. ఇక మాయా గురించి నానమ్మకి నానమ్మ గురించి మాయకి ఒకరినొకరు తెలుసుకుంటారు.
ఇక మీ బంధం కూడా ఎంత స్ట్రాంగ్ అనేది నానమ్మకి తెలిసిపోతుంది. నాకైతే మాయ ఇక్కడికి రావడం చాలా మంచిది అనిపిస్తుంది. ఏంట్రా నీకు ఇష్టం లేదా అని విక్కి నీ అడుగుతుంది. నీకు ఇష్టం అనిపిస్తే అలాగే చెయ్యి అక్క నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పద్మావతి శ్రీనివాసులు ఫోటో తీసుకొని స్వామి నేను ఇప్పటి వరకు ఎవరికీ తలవంచింది లేదు. నా ఆత్మ విశ్వాసం తో నేను తలెత్తుకొని ఉన్నాను. ఇప్పటి వరకు ఎవరికీ భయపడలేదు. కానీ ఆ టెంపరోడి దగ్గర ఓడిపోతూనే ఉన్నాను. ఇక తిరుపతి వచ్చి అమ్మ నాన్న దగ్గరే ఉంటాను. ఈ రోజు నీ దర్శనం చేసుకుంటాను. నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది.
ఇక విక్కీ మొక్కలకు నీళ్లు పోస్తూ పద్మావతి తిరుపతి వెళ్తే నాకేంటి ఇక్కడ ఉంటే నాకేంటి అసలు నేను ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటాడు. ఆర్య అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు రా నీళ్లు మొత్తం వేస్ట్ అవుతున్నాయి. బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావా అయినా మనం బిజినెస్ లో బాగానే ఉన్నాము కదా లేక అక్క గురించి ఆలోచిస్తున్నావా అక్క బావ తో సంతోషంగానే ఉంది కదా ఏమైంది చెప్పు అంటాడు. అప్పుడు విక్కీ నన్ను విసిగించకురా అనగానే ఆర్య నాకు తెలుసు నువ్వు పద్మావతి గురించి ఆలోచిస్తున్నావ్ కదా అంటాడు. సైలెంట్ గా ఉన్నావ్ అంటే నువ్వు పద్మావతి గురించి ఆలోచిస్తున్నావు నీ ఫీలింగ్స్ నీ మనసులోని దాచికోకపోతే మాకు కూడా చెప్పొచ్చు కదా అనగానే విక్కీ నన్ను విసిగించకు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆర్య మీ మధ్య ఉన్న మిస్ అండర్స్టాండింగ్ తొలగిపోయే వరకు ఇక ఈ సమస్యలు తప్పవు అనుకుంటాడు.
పద్మావతి కూరగాయలు కట్ చేస్తూ అక్కా తిరుపతికి టికెట్స్ బుక్ అయ్యాయి. ఇక ఈ రోజు సాయంత్రం మనం వెళ్ళిపోతున్నామంటుంది. నిన్న ఆఫీస్ కి వెళ్లి వచ్చినప్పటి నుండి చూస్తున్న ఇంటికి వెళ్దాం అంటున్నావ్ తప్ప అసలు ఏం జరిగిందో చెప్పడం లేదు. ఏమైంది అమ్మి మీ టెంపరోడు ఆఫీస్ కి వచ్చాడా అంటుంది. అవును అక్క నీ అనుమానమే నిజమైంది. నిన్న ఆదివారం కదా రాడు ఏమో అనుకున్నాను. కానీ వచ్చాడు. తను అన్న మాటలకి నాకు చాలా ఏడుపు వచ్చింది. వద్దు అమ్మి మనం ఇక్కడే ఉంటే నాకు ఆ టెంపరోడు అదేపనిగా గుర్తుకొస్తున్నాడు. అతను పెట్టిన బాధలు అతను చేసిన అవమానాలు గుర్తుకొస్తున్నాయి నేను ఈ బాధను తట్టుకోలేక పోతున్నాను అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.