Alappuzha Collector : Kerala Husband takes over as Alappuzha collector from wife
Alappuzha Collector : ఆమె ఒక జిల్లాకు కలెక్టర్.. ఆయనకు ఆమె ఒకంటి ఇల్లాలే కదా.. ఇద్దరూ భార్యభర్తలే.. కలెక్టర్లుగా బాధ్యాతయుతమైన వృత్తిలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు భార్య జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జిల్లాకే భర్త కలెక్టర్‌గా వచ్చాడు. ఆమెకు మరో జిల్లాకు బదిలీ అయింది. ఇద్దరూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా భర్తకు జిల్లా బాధ్యతలను భార్య అప్పగిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకాలం ఈ జిల్లా వ్యవహారాల్ని నేనే దగ్గరుండి చూసుకున్నాను. ఇకపై ఈ జిల్లా బాధ్యతలను మీ చేతుల్లో పెడుతున్నా.. జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఆ భార్య తన భర్తకు జిల్లాను అప్పగించింది.
Alappuzha Collector : Kerala Husband takes over as Alappuzha collector from wife
కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టరేట్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది. భార్య రేణురాజ్ అలప్పుళ కలెక్టర్‌గా పనిచేశారు. ఆమెను బదిలీ చేస్తూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు రేణు స్థానంలో ఆమె భర్త శ్రీరామ్ వెంకట్రామన్‌ను కొత్త కలెక్టరుగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే రేణు, శ్రీరామ్ ఇద్దరూ భార్యాభర్తలు కావడమే ఇక్కడ విశేషం మరి.. వీరిద్దరూ డాక్టర్లు అయినప్పటికీ సివిల్స్ ద్వారా ఐఏఎస్ అధికారులుగా మారిపోయారు. ఈ ఏడాదిలోనే ఏప్రిల్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. కేరళ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా శ్రీరామ్ పనిచేస్తున్నాడు.
తాజాగా జిల్లా కలెక్టర్‌గా శ్రీరామ్ బాధ్యతలు చేపట్టారు. భార్య రేణురాజ్ నుంచి భర్త శ్రీరామ్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. భార్య రేణు రాజ్ తన సీటులో కూర్చోమని భర్త శ్రీరామ్‌ను ఆహ్వానించింది. మరోవైపు.. అలప్పుజా కలెక్టర్ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో శ్రీరామ్ వెంకట్రామన్‌పై ఓ కేసు నమోదైంది. 2019లో శ్రీరామ్ తన స్నేహితురాలు వఫా ఫిరోజ్‌తో కలిసి కారు నడుపుతూ బైకుపై వెళ్తున్న ఢీకొట్టారు.
ఆ ప్రమాదంలో జర్నలిస్ట్ చనిపోయాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీరామ్ విచారణ ఎదుర్కొంటున్నాడు. 2020లో కేరళ ప్రభుత్వం అతడిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. అలప్పుజా జిల్లా కలెక్టర్‌గా శ్రీరామ్ బాధ్యతలు ఇవ్వడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అతని పోస్టింగ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు చేస్తోంది.
Read Also : Ramarao On Duty : మాస్ రాజాను కూడా వదల్లేదుగా.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ వీడియో లీక్..!
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
IPL 2025 Points Table : LSG చేతిలో ఓటమి కారణంగా SRH భారీ నష్టాన్ని చవిచూసింది. ఒకే స్ట్రోక్‌లో…
Vivo Y39 5G : వివో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Vivo Y39 5Gని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ధర…
Peddi First Look : జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
This website uses cookies.