Telugu Vantalu

Natu Kodi Pulusu : నోరూరించే నాటుకోడి పులుసు.. రుచిగా రావాలంటే ఈ మసాలా పొడి వేస్తే అదిరిపొద్ది!

Natu Kodi Pulusu : నాటుకోడి పులుసు రుచిగా రావాలంటే ఈ మసాలా పొడిని వేసి చూడండి.. టేస్ట్ మాత్రం అదిరిపొద్ది. చపాతీ, దోస, రైస్ ఎందులో అయినా తింటుంటే నోరూరిపొద్ది. ఈ నాటుకోడి పులుసు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కేజీ నాటుకోడి ముక్కలు తీసుకోండి. ఈ ముక్కలు వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పీన్ పసుపు వేసుకోవాలి.

ఈ నాటు కోడి ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక పది నిమిషాలు అలానే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయాలి. కాస్త నూనె వేడెక్కిన తర్వాత మీడియం సైజులో మూడు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. కేజీ చికెన్ మీడియం సైజ్ మూడు ఉల్లిపాయలు నాటుకోడికి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుండదు.

Advertisement

మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేంత వరకు వేయించుకోండి. మరి ఎర్రగా వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి కొంచెం ఉప్పు తీసుకుని వేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని వేసుకోవాలి.

ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి. నాటుకోడి పులుసు ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ గా అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మీడియం సైజు ఒక్క టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఒక్క టమాటా వేసుకుంటే సరిపోతుంది. కేజీ చికెన్‌కి ఒక్క టమాటా వేయాలి.

Advertisement

Natu Kodi Pulusu : నాటుకోడి పులుసు టేస్టీ టేస్టీగా ఉండాలంటే :

ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు మొత్తం వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు మొత్తం వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ వేయించాలి. చికెన్ ముక్కలు ఆయిల్లో బాగా వేగాలి. టేస్ట్ బాగుండాలంటే.. బాగా వేయించుకోండి.

ఈ చికెన్ లో నుంచి కొద్దిగా నీళ్లు మొత్తం నిలిచిపోయి బాగా వేగాలి. మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించండి. చికెన్ ఒకపక్క వేగుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేస్తారంటే.. ఒక పాన్ తీసుకొని ఐదు లవంగాలు, నాలుగు యాలకులు 1 1/2 దాల్చిన చెక్క, అనాకపువ్వు ఒకటి, రెండు ఎండు మిరపకాయలు, 1 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్‌లో పెట్టి మాడకుండా దోరగా వేయించుకోండి.

Advertisement
Natu Kodi Pulusu Telugu

వేయించుకునేటప్పుడు ఇందులోనే ఒక ఎండు కొబ్బరి ముక్కలను కట్ చేసి వేసుకొని వేయించుకోండి. కొంతమందికి ఎండు కొబ్బరి వేసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఎండు కొబ్బరి బదులుగా ఒక నాలుగైదు జీడిపప్పులు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాలు అన్ని లైట్‌గా వేగిన తర్వాత లాస్ట్ దీంట్లో ఒక్క టీస్పూన్ గసగసాలు తీసుకొని వేయించుకోండి. గసగసాలు తొందరగా వేగిపోతాయి.

లాస్ట్ వేసుకొని వేయించుకోవాలి. మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత అన్నింటిని తీసి మిక్సీ జార్‌లో వేసుకోండి. ఈ మసాలా పొడిని మిక్సీలో వేసుకోవచ్చు. లేదంటే మీరు రోలు ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి. మసాలా పొడి ఇంకా బాగుంటుంది. ఇందులో ఐదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Advertisement

స్పైసీగా ఉంటేనే నాటుకోడి పులుసు :
చికెన్ కూడా బాగా వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నాటుకోడి పులుసు ఎప్పుడైనా కాస్త కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి మొత్తం వేసి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించండి. మసాలా పొడి అనేది బాగా పట్టాలి. అడుగున మాడకుండా ఉండేలా లో ఫ్లేమ్ పెట్టి వేయండి.

ఇప్పుడు మసాలా పొడి కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. పులుసు మీకు కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే నీళ్లు కూడా పోసి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీ టేస్ట్‌కు తగ్గట్టు ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే మీరు ఉప్పు తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి.

Advertisement

ఇలా మొత్తం కలిపిన తర్వాత కుక్కర్‌కి మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 5 విజిల్స్ రానివ్వాలి. నాటుకోడి కాస్త గట్టిగా ఉంటుంది. ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది. మీకు ముదురు కోడి దొరికందంటే ఐదు విజిల్స్ మొత్తం పోయిన తర్వాత మూత తీయాలి.

మరీ పల్చగాను లేదు పులుసు అలా అని మరి గుత్తంగా లేకుండా మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. చివరిలో కొద్దిగా గరం మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నాటుకోడి పులుసు రెడీ.. రైసు, పూరి, చపాతి ఏది తిన్నా టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈసారి నాటుకోడి పులుసు వండే సమయంలో ఈ మసాల పొడిని తయారుచేసి వేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది.

Advertisement

Read Also : Minapappu Pachadi : మినపప్పుతో కమ్మని రోటి పచ్చడి.. ఇలా చేశారంటే సూపర్‌గా ఉంటుంది..!

Advertisement
Tufan9 Telugu News

Tufan9 Telugu News providing All Categories of Content from all over world

Recent Posts

Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్ మీకోసం.. !

Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…

2 weeks ago

Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…

2 weeks ago

Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు

Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…

2 weeks ago

CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?

CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…

3 weeks ago

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…

3 weeks ago

Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!

Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…

3 weeks ago

This website uses cookies.