G
Telugu News » TV Serials » tulasi motivates prem in singing competition in todays intinti gruhalakshmi serial episode
⚡ TV Serials, Latest, Trending

Intinti Gruhalakshmi July 8 Today Episode : సంతోషంలో తులసి కుటుంబం.. కావాలనే తులసితో గొడవ పెట్టుకున్న లాస్య..?

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్, ఇంటింటి గృహలక్ష్మి జూలై 7 ఈరోజు ఎపిసోడ్, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్, telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Intinti Gruhalakshmi July 8 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ప్రేమ్, శృతి పై ఫైర్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో లాస్య నందు తో మాట్లాడుతూ సంజన మనల్ని మ్యూజిక్ కాంపిటీషన్ కు ఆహ్వానించింది మనిద్దరం కలిసి ఎక్కడికి వెళ్దాం మనకు మనశాంతిగా ఉంటుంది అనడంతో నందు సరే అని అంటాడు. మరొకవైపు ప్రేమ్ మ్యూజిక్ విషయంలో ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకున్నా ఇంట్రెస్ట్ పెట్టలేకపోతాడు.

Intinti Gruhalakshmi July 8 Today Episode

మరొకవైపు తులసి కూడా ప్రేమ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే సంజన ఫోన్ చేసి మీ అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు కదా అని అడగగా అవును అదే పని మీద ఉన్నాడు అని చెబుతుంది తులసి. అప్పుడు ఆమె మీ మీద నమ్మకంతో నీ కొడుకుకి సులువుగా అవకాశం ఇచ్చాము ఏమైనా తేడా వస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అనడంతో ఏం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని అంటుంది తులసి.

మరొక వైపు ప్రేమ్ చిరాకు పడుతూ కనిపిస్తూ ఉంటాడు. ఇక తులసి ఇంతకుముందు ప్రేమ రాసుకున్న పాటల పుస్తకాన్ని చూసి ఇంత సత్తా ఉన్నప్పటికీ ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని కొడుకుని తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో అంకిత అక్కడికి వచ్చి మీరు ఇలా దూరంగా ఉన్నాడు కాబట్టే ప్రేమ్ ఏ విషయంలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు అని చెప్పడంతో తులసి ప్రేమ్ కోసం బయలుదేరుతుంది. ఇక మరొకవైపు తులసి ప్రేమ్ దగ్గరకు వెళుతుంది. అప్పుడు తులసి ప్రేమ్ మీద తనకు ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పడంతో, ప్రేమ్ కూడా తను ఎన్ని బాధలు కష్టాలు పడ్డాడో తులసీకూ చెప్పడంతో తులసి బాధపడుతూ ఉంటుంది.

Intinti Gruhalakshmi : కావాలనే తులసితో గొడవ పెట్టుకున్న లాస్య..?

ఆ తర్వాత తులసీ తన మాటలతో ప్రేమ్ ని ఎంకరేజ్ చేస్తుంది. అప్పుడు ప్రేమ్ తన తల్లిని గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ప్రేమ్ సంతోషంతో గిటార్ వాయించి తులసి శృతికి పాట వినిపించడంతో వాళ్లు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే కాంపిటీషన్ దగ్గరికి తులసి తన చిన్న కొడుకుని తీసుకొని వస్తుంది. ప్రేమ్ ఎలా అయినా ఈ కాంపిటీషన్ లో గెలుస్తాను అని అనడంతో అనసూయ దంపతులు కూడా ప్రేమ్ ని మరింత ఎంకరేజ్ చేస్తారు. ఇంతలో అభి అక్కడికి రాగా అప్పుడు తులసి పెద్దోడు చిన్నోడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాడు అని అంటుంది.

Advertisement

అప్పుడు అభి ప్రేమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పి తులసి గురించి కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తులసి లాస్య వాళ్ళు ఎదురుపడతారు. అప్పుడు లాస్య కావాలనే తులసిని గెలికి మరి తులసితో గొడవ పెట్టుకుంటుంది. నందు కూడా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తులసి ఎవరు ఏమనుకున్నా నువ్వు ఈ కాంపిటీషన్ లో గెలిచి నువ్వంటే ఏంటో నిరూపించుకోవాలి అని ధైర్యం చెబుతుంది తులసి. అప్పుడు లాస్య ప్రేమ్ విషయంలో ఒక ప్లాన్ వేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Intinti Gruhalakshmi july 7 Today Episode : తులసి మీద కోపంతో రగిలిపోతున్న లాస్య.. ఆనందంలో తులసి కుటుంబం ..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷divyaIntinti Gruhalakshminandupreamtulasi
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు