Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేమ్ ఇంటిదగ్గర ఆ ఇంటి ఓనర్లు గొడవ పడుతూ ఉంటారు. భార్య భర్తలు గొడవ పడుతూ ఉండటం చూసి ప్రేమ్ శృతి లు ఆపి ఏం జరిగింది అని అడగగా ఆమె అసలు విషయం చెబుతూ భర్తని నానా మాటలు అంటుంది. అయితే ఆ మాటలు ప్రేమ్ పరిస్థితికి తగ్గట్టుగా ఉండడంతో ఆ మాటలకు కనెక్ట్ అయిన ప్రేమ్ బాధపడతాడు. ఆమె అన్న మాటలను గుర్తు తెచ్చుకొని ప్రేమ్ ఆలోచనలో పడతాడు.
మరొకవైపు అంకిత దివ్య మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దివ్య మాత్రం తులసి పై మరింత ద్వేషం పెంచుకుంటూ ఉంటుంది. తప్పంతా తులసిదే అన్నట్టుగా ఆమెను నిందిస్తూ మాటలు అంటూ ఉంటుంది. కానీ అంకిత మాత్రం తులసి అంటే చాలా మంచిది మీ ఆలోచనల్లో ఎవరో విషం నింపారు అని చెబుతున్న కూడా దివ్య మాత్రం మొత్తం మమ్మీ ని చేసింది అని అంటుంది.
ఇంతలో అభి అక్కడికి వచ్చి దివ్య కి సపోర్ట్ గా మాట్లాడటంతో దివ్య తులసి పై కోపంతో మరింత రెచ్చిపోతోంది. మరొకవైపు రాములమ్మ ప్రేమ్ కోసం జున్ను తీసుకొని వస్తుంది. కానీమేం మాత్రం ఆ జున్ను ను తినడానికి ఇష్టపడటం లేదు. అప్పుడు రాములమ్మ ఏం జరిగింది బాబు అని అనగా అప్పుడు ప్రేమ్ తన బాధంతా కూడా రాములమ్మ తో చెప్పుకుంటాడు.
శృతి కోసం ఆటో నడపాలి అనుకుంటున్నాను సహాయం చేయమని అంటాడు. శృతి వచ్చి ఏం జరిగింది అని అనగా ఏమీ లేదు అని అనడంతో సరే మీరు ఇద్దరు మాట్లాడుకోండి అని శ్రుతి అక్కడినుంచి వెళ్ళిపోతుండగా రాములమ్మ పిలిచి జున్ను విషయం చెప్పి అసలు విషయాన్ని శృతి దగ్గర దాస్తారు. ఇక తులసి ఇంట్లో జరిగిన విషయం గురించి ప్రేమ్ గురించి బాధ పడుతూ ఉండగా ఇంతలో అనసూయ వచ్చి ధైర్యం చెబుతుంది.
బాధపడకు అంతా మంచే జరుగుతుంది అని అనగా తులసి కాస్త ధైర్యం తో సరే అత్తయ్య అని అంటుంది. మరొకవైపు ప్రేమ్ ఆలోచించి చీకటి పడడంతో పడుకుంటాడు. అర్ధరాత్రి సమయంలో శృతి పక్కన లేకపోవడం చూసి టెన్షన్ పడతాడు. శృతి అని పిలవగా ప్రేమ్ పుట్టినరోజు సందర్భంగా క్యాండిల్స్ తో సర్ప్రైస్ చేస్తుంది శృతి.
చిన్నగా కేక్ కట్ చేసి నోట్లో పెట్టగా ప్రేమ్ తన లాస్ట్ బర్త్ డే ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒకవైపు ప్రేమ్ కోసం ఇంట్లో అందరూ కలిసి బర్త్ డే డెకరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ప్రేమ్ కు తెలియకుండానే సర్ప్రైజ్ ఇవ్వాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.