G
Telugu News » TV Serials » swapna insult hima in todays karthika deepam serial episode
TV Serials

Karthika Deepam: హిమ ని అవమానించిన స్వప్న.. సౌందర్యాన్ని చూసిన సౌర్య..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

ప్రేమ్ తన కారు కి ఆటో అడ్డం ఉండటంతో ఆటో ని కాలితో తంతాడు. అది చూసిన సౌర్య కోపంతో మేటర్ ఎక్కువ చేస్తే మీటర్ పగిలిపోతుంది అంటూ ప్రేమ్ ని బెదిరిస్తుంది. మరొకవైపు సౌందర్య, ఆనందరావు, హిమ లు కూర్చొని భోజనం చేస్తుండగా హిమ మాత్రం తినకుండా ఆలోచిస్తూ ఉంటుంది.

హిమ, సౌర్య ని తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య బాధపడకు తిను అని ఓదారుస్తుంది. ఈ క్రమంలోనే ఆనందరావు సౌర్య కావాలనే కనిపించకుండా తప్పించుకుని తిరుగుతోంది ఏమో అని అంటాడు. మరొకవైపు సౌర్య చంద్రమ్మ దంపతులను తీసుకొని సత్య ఇంటికి వెళ్తాడు.

సౌర్య చంద్రమ్మ దంపతులను తన ఇంట్లో చూసిన ప్రేమ్ వారిపై విరుచుకు పడతాడు. అప్పుడు సౌర్య జరిగినదంతా సత్యకు వివరిస్తుంది. అలా వారిద్దరి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరుగుతుంది. ఇక చివర్లో వెళ్ళిపోతూ సౌర్య, ప్రేమ్ కి వార్నింగ్ ఇచ్చి వెళుతుంది.

Advertisement

మరొకవైపు నిరూపమ్, హిమ కలిసి స్వప్న ఇంటికి వెళ్తారు. అక్కడ స్వప్న,హిమ ని నానా మాటలు అని హిమ ఏడిపిస్తూ బాధ పెడుతుంది.హిమ నే కార్తీక్,దీప లను చంపింది అన్నట్టుగా స్వప్న మాట్లాడడంతో హిమ బాధపడుతూ ఉంటుంది.

ఇక మరొకవైపు హాస్పటల్ లో హిమ, సౌర్య,నిరూపమ్,ప్రేమ్ లు ఎదురు పడతారు. ఈ క్రమంలోనే నిరూపమ్ తన గురించి ప్రేమగా మాట్లాడటం తో సౌర్య,నిరూపమ్ తో ప్రేమలో పడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సౌందర్యని సౌర్య చూస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

🏷himakarthika deepamnirupampreamsoundaryasourya
f𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు