G
Telugu News » TV Serials » soundarya cry karthik and deepa met with accident in todays karthika deepam serial episode
⚡ TV Serials, Latest, Topstory

Karthika Deepam March 8th Today Episode : ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ బాబు వంటలక్క.. గుండెలవిసేలా రోదిస్తున్న సౌందర్య..?

%excerpt%  

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Karthika Deepam March 8th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం.. విహారయాత్రకు వెళ్లిన వంటలక్క, డాక్టర్ బాబు అక్కడ ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో దీప కారులో హిమ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని భయపడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఏమీ కాదు అని ధైర్యం చెబుతాడు.

ఆ తర్వాత కార్తీక్ ఎన్నెన్నో అందాలు కోల్పోయాము కష్టాలు పడ్డాము కానీ ఇప్పుడు అవన్నీ పోయి వంటలక్క,డాక్టర్ బాబు మాత్రమే అని అనగా దీప ఆనందంతో నవ్వుతుంది. అలా వారిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటారు.

Advertisement
Karthika Deepam March 8th Today Episode

మరొకవైపు సౌందర్య గుడిలో పూజారి చెప్పిన మాటలకు భయపడి కార్తీక్, దీప ల దగ్గరకు వెళ్ళడానికి టికెట్ తీసుకుని బయలుదేరుతుంది. అప్పుడు ఆనందరావు సౌందర్య ధైర్యం చెప్పి టికెట్ క్యాన్సిల్ చేయిస్తాడు. మరొకవైపు హిమ దీప ని వంటలక్క అంటూ ఆట పట్టిస్తుంది. ఇక ఆ క్రమంలోనే కార్తీక దీప లు ఐ లవ్ యు అని చెప్పుకుంటారు. ఇక అప్పుడు దీప కార్తీక్ ఇష్టమైన మందు బాటిల్ ను సర్ ప్రైజ్ గా ఇస్తుంది. మరోవైపు సౌందర్య కు ఆనందరావు ఎన్ని జాగ్రత్తలు ఎంత ధైర్యం చెప్పినప్పటికీ భయపడుతూనే ఉంటుంది.

Karthika Deepam March 8th Today Episode : డాక్టర్ బాబు, వంటలక్కకు ఏమైంది? ఈరోజు ఎపిసోడ్ బిగ్ ట్విస్ట్ ఇదే..

దీనితో సౌందర్యను డాక్టర్ దగ్గరకి తీసుకెళతాను అని అంటాడు. కార్తీక్,దీప లకు ఏం జరుగుతుందో అని సౌందర్య ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ దీప లు పిల్లలతో కలసి కొండ ప్రాంతానికి వెళ్తారు. అక్కడికి మా కార్ డ్రైవ్ చేస్తాను అంటూ కార్ స్టార్ట్ చేస్తుంది.

కొంత దూరం వెళ్ళిన తరువాత హిమ కారుని హ్యాండ్ చేయలేకపోవడంతో , వంటలక్క డాక్టర్ బాబు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు కార్తీక్ వచ్చి కాపాడే ప్రయత్నం చేయగా కారు అదుపు తప్పి లోయలోకి పడి బ్లాస్ట్ అవుతుంది. ఆ ప్రమాదంలో కార్తీక్, దీప, హిమలు చనిపోతారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karthika Deepam March 7th Today Episode : చివరి రోజు అన్న కార్తీక్ .. బోరున ఏడ్చేసిన సౌందర్య..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷deepahimakarthikkarthika deepamkarthika deepam doctor babukarthika deepam Serialkarthika deepam telugu serialkarthika deepam vantalakkasoundaryaVantalakka
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు