G
Telugu News » TV Serials » radha prises adithya in todays devatha seial eipsode
⚡ TV Serials

Devatha: ఆదిత్య గురించి గొప్పగా చెప్పిన రాధ.. రంగంలోకి దిగిన దేవుడమ్మ..?

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసు  

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

రాధ, ఆదిత్య తో మాట్లాడుతూ.. నన్ను నమ్ము పెనిమిటి, నీమీద దేవమ్మ చాలా కోపంగా ఉంది. ఆ కోపాన్ని నేను పోగొట్టి నీకు దగ్గర చేస్తాను. ఇంతకు ముందు ఇలాగే ప్రేమగా మాట్లాడి ఎలా చేస్తాను అని మాట ఇస్తుంది. కానీ ఆదిత్య వినకుండా అవి ఏమీ అవసరం లేదు. నేను తండ్రిని అని దేవికి నిజం చెప్పు.. ఒకవేళ నీ వల్ల కాదు అంటే చెప్పు మా అమ్మతో దేవికి నేను చూపిస్తాను అంటూ బెదిరిస్తాడు ఆదిత్య.

మరొకవైపు రమ్య, మాధవ కి రాధ పై అనుమానం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రాధ అక్కడికి రాగా ఎక్కడికి వెళ్లావు రాధ అని జానకి అడగడంతో గుడికి వెళ్ళాను అని చెబుతుంది. కానీ రమ్య మాత్రం గుడికి వెళితే బొట్టు, ప్రసాదం ఏది అని అడగగా.. బొట్టు చెరిగిపోయింది.. ప్రసాదం దారిలో అవ్వ కనిపిస్తే ఇచ్చేశాను అని అబద్ధం చెబుతుంది.

నిజం చెప్పు అని రమ్య పదేపదే అడుగుతుండడంతో నిజంగానే నా దేవుని దగ్గరకు పోయి వస్తున్న అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాద. మరొక వైపు ఆదిత్య, దేవి ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సత్య ఏ పెర్ఫ్యూమ్ బాగుందో స్మెల్ చూసి చెప్పు అనగా నన్ను విసిగించకు అంటూ సత్య పై అరుస్తాడు.

అప్పుడు సత్య హర్ట్ అవ్వడంతో తనను కూల్ చేయడానికి కొద్ది సేపు పర్ఫ్యూమ్ తో రొమాన్స్ పండిస్తాడు ఆదిత్య. ఇక మరొకవైపు పిల్లలు స్కూల్ కి వెళ్తున్న సమయంలో రాధ బిడ్డ ఆదిత్య సార్ నిజంగా చాలా మంచివాడు.. నువ్వు అపార్థం చేసుకున్నావు అని మాట్లాడుతూ ఉండగా..

ఆ మాటలు విన్న మాధవ షాక్ అవుతాడు. దేవి మాత్రం రాధ చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా బ్యాక్ సర్దుకుని పోదామా నాయన అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷adithyaDevathadevimadhavaradha
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు