G
Telugu News » TV Serials » radha attempts to show adithyas positive side to devi but she fails in todays devatha serial episode
⚡ TV Serials

Devatha: దేవినే తన వారసురాలు అని తెలుసుకున్న దేవుడమ్మ ఏం చేయనుంది..?

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం..  

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

శివరాత్రి పండుగ సందర్భంగా రాధ ఉపవాసంతో శివాలయంలో గుడి దగ్గర దీపాలు వెలిగించి నా చెల్లెలికి బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పారు కానీ నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది నా చెల్లికి ఎలాగైనా బిడ్డలు పుట్టాలి అని దేవుని ప్రార్థిస్తుంది.

మరొకవైపు చిన్మయి, దేవీలు స్నానం చేసి రాగా రాదా వాళ్ళకి బట్టలు వేసుకోవడానికి ఇస్తుంది. ఇక ఆదిత్య ఉన్న తెల్ల డ్రెస్సు ని వేసుకోమని దేవికి ఇవ్వగా దేవి ఆ డ్రస్ ను విసిరి కొడుతుంది. అప్పుడు రాద ఎందుకు బిడ్డ ఇట్లా చేస్తున్నావు.. ఆ ఆఫీసర్ మీద ఎందుకు అంత కోపం. ఆ ఆఫీసర్ చాలా మంచోడు అని చెప్పినా కూడా దేవి వినిపించుకోలేదు.

దేవి రాధ ఇచ్చిన డ్రెస్ ని కాకుండా వేరే డ్రెస్ కోసం వెతుకుతుంది. అప్పుడే ఆదిత్య దేవి మెడలో వేసిన బంగారు గొలుసు కనిపించగా విసిరేయాలి అన్నంత కోపంగా చూస్తుంది. మరొకవైపు పార్కులో దేవుడమ్మ దేవి,చిన్మయి కోసం ఎదురు చూస్తూ ఉండగా, దేవి ఆ గొలుసును దేవుడమ్మకి ఇస్తుంది.

Advertisement

గొలుసు చూసిన దేవుడమ్మ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు దేవుడమ్మ దేవి ఇది నీకు ఎక్కడిది అని అడగగా.. ఆఫీసర్ సారీ ఇచ్చిండు.. మీరు కావాలంటే మా నాయన చేయిస్తారు తీసుకొనిపోయి ఆఫీసర్ కి ఇవ్వండి అని అంటుంది దేవి.

ఆ గొలుసుని అవ్వకు ఇవ్వడానికి వచ్చినా, అవ్వకి గొలుసును ఇచ్చేశాను. నాకు ఈ రోజు వాడుకోవాలని లేదు వెళ్దాం పద అని చిన్మయి కూడా తనకు తీసుకెళ్తుంది దేవి. ఇక దేవుడమ్మ ఆలోచనలో పడుతుంది. మరొకవైపు సత్య కడుపులో బిడ్డ మెదులున్నట్లు అనిపిస్తుంది.

అదే విషయాన్ని సత్య ఆదిత్య చెప్పగా, ఆదిత్య మాత్రం డాక్టర్ చెప్పిన మాటలను పట్టుకుని తల్లి కాదు అని అనుకుంటాడు. కానీ సత్య మాత్రం ఆదిత్య దగ్గరకు వెళ్లి ఆదిత్య చేతిని తన కడుపు పై వేసుకొని మురిసి పోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷adithyaDevathadevidevudammaradhasathya
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు