G
Telugu News » TV Serials » jwala fires on anand rao and soundarya in todays karthika deepam serial episode
⚡ TV Serials, Latest, Trending

Karthika Deepam june 29 Today Episode : సౌందర్య,ఆనంద్ రావులపై మండిపడిన జ్వాలా.. బాధతో కుమిలిపోతున్న హిమ..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Karthika Deepam june 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా ఆటోని నిరుపమ్ కి తిరిగి ఇచ్చేస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్, స్వప్న పెళ్లి పనులు చూసుకుంటూ ఉండగా ఇంతలో శోభ అక్కడికి వస్తుంది. బయట జ్వాలా ఆటో ఉంది ఏంటి అని అడగగా అప్పుడు స్వప్న జరిగింది మొత్తం వివరిస్తుంది. ఆ తర్వాత స్వప్న ఫోన్ వచ్చి పక్కకు వెళ్లడంతో నిరుపమ్ తో మాట్లాడుతూ ఉంటుంది శోభ. అప్పుడు నిరుపమ్ జరిగింది మొత్తం వివరించడంతో ఒకవైపు సంతోష పడుతూనే పెళ్లిని ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement
Karthika Deepam june 29 Today Episode

మరొకవైపు జ్వాలా, నిరుపమ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇలా జరగడానికి అంతటికి కారణం హిమనే అని హిమ పై కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలోనే సౌందర్య, ఆనంద్ రావు లు వస్తారు. అప్పుడు సౌందర్య జ్వాలతో మాట్లాడుతూ నీకు తెలియకుండా మేము ఒక పని చేసాము అని అంటుంది. అప్పుడు ఏం చేశారు అని అడగగా నువ్వు ద్వేషిస్తున్న ఆ తింగరి నీ తీసుకు వచ్చాము అనడం తో రగిలి పోతూ ఉంటుంది.

అయితే అప్పుడు ఆనంద్ రావు సౌందర్య ఎంత నచ్చచెప్పినా కూడా జ్వాలా వినిపించుకోకుండా కోపంతో రగిలిపోతుంది. అప్పుడు హిమ ని జ్వాలా మెడబట్టి బయటకు గెంటేస్తుంది జ్వాలా. అప్పుడు ఆనందరావు సౌందర్య మధ్యలో కలుగజేసుకోవడంతో మీరు మధ్యలో దొరికితే బాగుండదు నీకు నాకు ఫ్రెండ్షిప్ కూడా కట్ అవుతుంది చూడు సీసీ అంటూ వార్నింగ్ ఇస్తుంది.

అయితే అప్పుడు హిమ అసలు నిజం చెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా జ్వాలా వినిపించుకోదు. అంతేకాకుండా సౌందర్య ఆనందరావులపై మండిపడుతూ ఇలాంటి రాయబారాలు నడిపేలా ఉంటే ఇంకొకసారి మా ఇంటి గడప తొక్కదండి అని చెప్పి ముఖం మీద తలుపులు వేస్తుంది.

ఆ తర్వాత జరిగిన విషయాన్ని తలచుకుని హిమను బాధతో కుమిలిపోతూ ఉండగా అక్కడికి Bసౌందర్య ఆనందరావు వచ్చి హిమకు ధైర్యం చెబుతారు. ఆ తర్వాత నిరుపమ్, హిమ ఇద్దరు గుడి లో కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు నిరుపమ్, నీతో నాకు పెళ్లి ఫిక్స్ అయినందుకు ముడుపు కడతాను అని అనగా, అప్పుడు హిమ ఎలా అయినా నీకు జ్వాలాకు పెళ్లి జరగాలి అని ముడుపు కడతాను అని అంటుంది.
Read Also :  Karthika Deepam june 28 Today Episode : శోభ చెంప చెళ్లుమనిపించిన హిమ.. స్వప్నకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన జ్వాలా?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Anand raohimajwalakarthika deepamsoundaryasourya
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు