G
Telugu News » TV Serials » jnanambas family feels relieved as janaki completes the ritual in todays janaki kalaganaledu serial episode
⚡ TV Serials, Latest, Trending

Janaki Kalaganaledu serial Oct 6 Today Episode : మల్లిక చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న జెస్సీ తల్లిదండ్రులు.. ఆనందంలో జ్ఞానాంబ దంపతులు.?

Janaki Kalaganaledu serial Oct 6 Today Episode, Janaki Kalaganaledu serial, Janaki Kalaganaledu 6-10-2022 serial, జానకి కలగనలేదు సీరియల్, telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Janaki Kalaganaledu serial Oct 6 Today Episode: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జానకి ఇంటికి ఒక పాప వచ్చినందుకు అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో జానకి వాళ్ళ ఇంటికి వచ్చిన పాపతో పూజ చేయిస్తూ ఉంటుంది. అప్పుడు మల్లికా ఈ పాప వచ్చి నా ప్రాణం తో చెడగొట్టింది అని మనసులో కుళ్లుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ పాప ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడతారు అని అడగడంతో అప్పుడు జానకి దాని గురించి వివరిస్తూ ఉంటుంది.

Jnanamba’s family feels relieved as Janaki completes the ritual in todays janaki kalaganaledu serial episode

అప్పుడు జానకి మాటలు విన్న జ్ఞానాంబ, ఈ మాటలు జానకి నాకే చెబుతున్నట్లు అనిపిస్తుంది. నేను విష్ణు అఖిల్ విషయంలో బాధపడుతున్నాను అని కాస్త ఓర్పుతూ ఉంటే వాళ్లే మారతారు అని జానకి నాకు చెప్పకనే చెప్పి కాస్త ప్రశాంతతను ఇచ్చింది అని అనుకుంటూ ఉంటుంది జ్ఞానాంబ. ఇప్పుడు నా ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది ఇంకొక ప్లాన్ చేయాలి అని మల్లిక ఇంకొక ప్లాన్ వేస్తుంది.

Advertisement

ఆ తర్వాత మల్లిక జానకి వాళ్ళ నాన్న పీటర్ కి ఫోన్ చేస్తుంది. అప్పుడు జ్ఞానాంబ గురించి చెడుగా చెప్పడంతో జెస్సి వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. జెస్సిని కూడలిగా కాదు కదా కనీసం సాటి మనుషులా కూడా చూడడం లేదు అసలు విలువ ఇవ్వడం లేదు. అఖిల్ కూడా వాళ్ళ అమ్మని ఏమీ అనలేకపోతున్నాడు. రామచంద్ర జానకిలు కూడా ఏం చేయడం లేదు బాబాయ్ గారు అంటూ లేనిపోని మాటలు అన్ని చెప్పి వారిని రెచ్చగొడుతుంది.

ఇక జెస్సి కి ఇక్కడ సమస్యలు చెబితే తీరవు అని చెప్పి వారిని రెచ్చగొట్టి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు మల్లిగ మాటలు నిజం అని నమ్మిన జెస్సి వాళ్ళ నాన్న ఇప్పుడు అక్కడికి వెళ్లి మనం నిజం తేల్చుకోవాలి. జ్ఞానాంబ గారు ఇలా చేస్తారని నేను అనుకోలేదు అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు జానకి చదువుకుంటూ ఉండగా రామచంద్ర టీ కలుపుకొని వస్తాడు.

జానకి కలగనలేదు సీరియల్ అక్టోబర్ 6 ఈరోజు ఎపిసోడ్ :
జెస్సీ తల్లిదండ్రులు షాక్ ..

అప్పుడు జానకి నేను బాగానే చదువుకుంటున్నాను మీరు వెళ్లి పడుకోండి రామా గారు అని అంటుంది. కానీ రామచంద్ర వినకుండా జానకి చదువుకుంటుంటే అలాగే చూసుకుంటూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం మల్లిక జాగింగ్ చేస్తూ దాల దూరం వస్తుంది. అమ్మయ్య ఇంటికి చాలా దూరం వచ్చేసాను అని అనుకుంటూ జాగింగ్ చేస్తూ ఉండగా ఇంతలోనే రామచంద్ర జానకి వాళ్ళు అటుగా వస్తారు.

అప్పుడు వాళ్లను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మల్లిక. ఏం చేస్తున్నావ్ మల్లికా అని జానకి అడగడంతో టీవీలో చెప్పారు అందుకే ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని అనడంతో గర్భవతిగా ఉన్నవారు ఇలాంటి ఎక్సైజ్ చేయకూడదు కేవలం జాగింగ్ మాత్రమే చేయాలి అని మల్లికకు జాగ్రత్తలు చెబుతుంది జానకి. ఇప్పుడు మల్లికా కాస్త ఓవరాక్షన్ చేస్తూ కింద పడిపోతూ ఉండగా జానకి పట్టుకొని, ఇక ఈరోజు చాలు ఓవరాక్షన్ చేయకుండా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో పద అని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది.

మరోకవైపు జ్ఞానాంబ దంపతులు నవరాత్రులు అయిపోయిలోగా ఇంట్లో సమస్యలను తీరిపోయి మనశ్శాంతిగా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే జెస్సి తల్లి తండ్రీలు అక్కడికి వస్తారు.

Read Also : Janaki Kalaganaledu Oct 4 Today Episode : జెస్సీ ని అసహ్యించుకుంటున్న అఖిల్.. సరికొత్త ప్లాన్ వేసిన మల్లిక..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷janakiJanaki Kalaganaledujanaki kalaganaledu serialjessieJnanambamallikarama
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు