G
Telugu News » TV Serials » jananamba feels sad about rama chandra in todays janaki kalaganaledu serial episode
⚡ TV Serials, Latest, Topstory

Janaki kalaganaledu: జ్ఞానంబ కుటుంబంలో మరో కష్టం.. మదర్స్ డే రోజు మంట రాచేసిన లీలావతి.. అసలేం జరిగిందంటే?

Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జ్ఞానాంబ ఓటమి రూపంల

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జ్ఞానాంబ ఓటమి రూపంలో ఈ అమ్మకు అద్భుతమైన బహుమతి ఇస్తున్నావ్ అని కన్నబాబు తల్లి శభాష్ అంటూ మెచ్చుకుంటుంది. మరోవైపు వెన్నెల.. మదర్స్ డే సెలబ్రేషన్ చేద్దామని చెప్పినందుకు జానకి కు థాంక్స్ చెబుతుంది.

ఆ క్రమంలో ఫ్యామిలీ అందరూ జానకి ను మెచ్చుకుంటారు. ఆ తర్వాత రామచంద్ర స్వీట్ షాప్ ను డెకరేట్ చేస్తూ ఉండగా.. ఈలోపు అక్కడకు కన్నబాబు వస్తాడు. అంతేకాకుండా ఒక వారం తర్వాత మీ షాప్ నాదే అని రామచంద్ర తో అంటాడు. ఇక రామచంద్ర ఏంటి నీ గోల అంటూ కన్నబాబు పై విరుచుకు పడతాడు. ఇక కన్నబాబు ఏమాత్రం పట్టించుకోకుండా.. సరిగ్గా 8వ రోజు ఈ బోర్డు పీకేయాలి అని అంటాడు.

Advertisement

అంతేకాకుండా ఆ ప్లేస్ లో తన తల్లి పేరు పెడతాను అని అంటాడు. దాంతో అసహనం వ్యక్తం చేసిన రామచంద్ర కన్నబాబు కాలర్ పట్టుకుంటాడు. ఇక ఇంకొక క్షణం నువ్వు ఉంటే నీ మెడ మీద తలకాయ లేకుండా చేస్తాను అని రామచంద్ర వార్నింగ్ ఇస్తాడు. దాంతో కన్నబాబు రామచంద్ర తీసుకున్న అప్పు విషయంలో తాను వేసిన ఏవిల్ ప్లాన్ బయటపెడతాడు.

ఇక వీరేంద్ర కూడా ఆ ఫైనాన్స్ ఆఫీసు కన్నబాబు గారిదే.. కాకపోతే అది నేను నడిపిస్తున్నాను అని అంటాడు. ఆ మాటతో రామచంద్ర కు ఏం చేయాలో అర్థం కాదు. ఇక కన్నబాబు ఎనిమిది రోజుల్లో నా డబ్బులు నాకు ఇవ్వు లేకపోతే మీ షాప్ నేను తీసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.

Advertisement

ఇక ఈ ఘటనను దూరం నుంచి గమనించిన లీలావతి వెంటనే మల్లిక దగ్గరకు వెళ్లి జరిగిన విషయం అంతా చెబుతుంది. ఇక జ్ఞానాంబ ను స్వీట్ షాప్ దగ్గరకు తీసుకొని వచ్చి ఫ్యామిలీ అంతా హ్యాపీ మదర్స్ డే చెబుతారు. ఈ క్రమంలో జానకి అమ్మ ప్రతిరోజు దేవతే.. అత్తయ్య గారు అని అంటుంది.

ఈ క్రమంలో జానకి మదర్స్ డే గురించి జ్ఞానాంబ కు ఎంతో గొప్పగా చెబుతుంది. ఇక జానకి మాటలకు జ్ఞానాంబ కూడా ఆలోచిస్తుంది. ఈలోగా అక్కడకు లీలావతి వస్తుంది. ఇందాక షాపు ముందర అంత గొడవ జరిగినా.. మీరంతా ఆనందంగా పండుగ చేసుకుంటున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం అని అంటుంది.

ఇక వెన్నెల ఎప్పుడు మా సంతోషాన్ని చెడగొట్టాలని చూస్తావా అని లీలావతి ను అడుగుతుంది. దాంతో మీ షాపు ముందు మీ అన్నయ్య కన్నబాబు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు అని అసలు విషయం చెబుతుంది. దాంతో ఫ్యామిలీ అంతా ఆశ్చర్యపోతూఉంటారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷janakiJanaki Kalaganaledumallikarama chandra
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు