Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Robot Giving Birth : ఇకపై రోబోలు కూడా పిల్లల్ని కంటాయి.. రోబోలే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిస్తాయట.. చైనా అద్భుత సృష్టి

Robot Giving Birth

Robot Giving Birth

Robot Giving Birth : ఇప్పటివరకు, మానవులు తమ తల్లుల గర్భం నుండి జన్మించారు, కానీ చైనా ఈ సంప్రదాయాన్ని మార్చడానికి సన్నాహాలు (Robot Giving Birth) చేస్తోంది. అక్కడి శాస్త్రవేత్తలు స్వయంగా గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చే రోబోలను తయారు చేస్తున్నారు. ఇది వింతగా అనిపిస్తుంది, కానీ వచ్చే ఏడాది నాటికి సాంకేతికత సిద్ధంగా ఉంటుందని మరియు మానవ జీవితం యంత్రాలతో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

ఇప్పటివరకు, మనుషులు తల్లి గర్భం నుంచి మాత్రమే జన్మించారు. 9 నెలల ప్రేమ, నిరీక్షణ, బాధ తర్వాత మాత్రమే కొత్త జీవం శిశువు రూపంలో ఈ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. కానీ, చైనా ఈ సాంప్రదాయ ప్రక్రియను మార్చడానికి రెడీ అవుతోంది.

అక్కడి దేశీయ శాస్త్రవేత్తలు స్వయంగా గర్భవతిగా మారి మానవ బిడ్డకు జన్మనిచ్చే రోబోలను సృష్టిస్తున్నారు. ఇది నమ్మశక్యం కానిదిగా అనిపిస్తుంది. కానీ, ఈ టెక్నాలజీ రాబోయే ఒక సంవత్సరంలో వాస్తవ రూపం దాల్చుతుందని చైనా టెక్ కంపెనీ పేర్కొంది.

Advertisement

Read Also : Singer Chaiwala : ఈ టీ అమ్మేవాడు సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్.. ఇతడి టీ తాగి పాట కోసం జనాలు పిచ్చెక్కిపోతున్నారు..!

రాబోయే కాలంలో, మానవులు తల్లి ఒడిలో కాదు.. ఒక యంత్రం లోపల జన్మిస్తారని అర్థం. అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఇది సైన్స్ కొత్త చొరవనా లేదా తల్లి భావనను తగ్గించే సాంకేతికతనా? ఈ ఆవిష్కరణ గురించి సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది దీనిని భవిష్యత్ అద్భుతంగా భావిస్తున్నారు. మరికొందరు మానవాళికి ముప్పుగా భావిస్తున్నారు.

Robot Giving Birth : చైనా కంపెనీ అదృష్ట సృష్టి :

చైనీస్ టెక్ కంపెనీ కైవా యంత్రాలు మానవుల వంటి పిల్లలకు జన్మనిచ్చే ప్రత్యేక టెక్నాలజీపై పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ టెక్నాలజీ కేవలం ఒక ఏడాదిలోనే సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. అంటే.. భవిష్యత్తులో శిశువు మొదటి ఏడుపు తల్లి ఒడిలో కాకుండా రోబో గర్భం లోపల వినవచ్చు.

Advertisement

Robot Giving Birth : రోబో నుంచి బిడ్డ ఎలా పుడుతుంది? :

కంపెనీ ప్రకారం.. ఈ రోబోకు ప్రత్యేకమైన ఇంక్యుబేషన్ పాడ్ ఉంటుంది. ఈ పాడ్ స్త్రీ గర్భం లాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. టెంపరేచర్ మానవ శరీరం మాదిరిగానే ఉంటుంది. హార్మోన్లు, పోషకాహారం యంత్రం ద్వారా నియంత్రించడం జరుగుతుంది. శిశువు మిషన్ లోపల అభివృద్ధి చెందుతుంది.

ఈ టెక్నిక్ IVF, సరోగసీ కన్నా కూడా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడ మొత్తం నియంత్రణ యంత్రంతో ఉంటుంది. అంటే.. బిడ్డను కోరుకునే వారికి కానీ గర్భధారణ శారీరక లేదా మానసిక ప్రక్రియ ద్వారా వెళ్లకూడదనుకునే వారికి ఇది గేమ్ ఛేంజర్‌గా చెప్పవచ్చు.

ధర ఎంతంటే? :
ఈ రోబో ఖరీదు దాదాపు 1 లక్ష యువాన్లు (సుమారు 13,900 డాలర్లు లేదా రూ. 12 లక్షలు) ఉంటుందని కంపెనీ చెబుతోంది. అంటే, చౌకైన టెక్నాలజీ కాదు. కానీ, ఇప్పటివరకు సైన్స్ ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన ఆవిష్కరణగా చెప్పవచ్చు.

Advertisement

ఇదంతా కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు. త్వరలో వాస్తవంగా మారవచ్చు. చైనా ఈ టెక్నాలజీతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక రోబో గర్భం నుంచి మనిషి ఎలా పుడతాడు ఇదేలా సాధ్యం అనేదానిపైనే ఇప్పుడు అందరి దృష్టిపడింది.

Exit mobile version