Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Virender Sehwag : వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి విడాకులు..? ఇందులో నిజమెంత? 20ఏళ్ల కాపురానికి వీడ్కోలు పలకనున్నారా?

Virender Sehwag, Wife Aarti Ahlawat Divorce Rumors in Telugu

Virender Sehwag Divorce : భారత క్రికెటర్ల విడాకుల వార్త ఈరోజుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోయారనే చర్చ నడుస్తోంది. మనీష్ పాండే, అశ్రిత శెట్టి మధ్య సఖ్యత లేదని పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ సోషల్ మీడియా నుంచి ఒకరి ఫోటోలు కూడా తొలగించారు.

ఇప్పుడు క్రికెట్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్.. భారత క్రికెట్ జట్టు మాజీ వెటరన్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ 20 ఏళ్ల వివాహానంతరం తన భార్య ఆర్తీ అహ్లావత్ నుంచి విడాకులు తీసుకోబోతున్నట్టు సమాచారం. 2004లో వివాహం చేసుకున్న ఆర్తి, సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దాంతో వారి రిలేషన్ షిప్ స్టేటస్ గురించి పుకార్లకు ఆజ్యం పోసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. సెహ్వాగ్, అహ్లావత్ గత కొన్ని నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. వీరిద్దరి విడాకులకు సంబంధించి ఏ ఒక్కరూ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు.

Virender Sehwag Divorce : సెహ్వాగ్-ఆర్తి విడిపోవాలని నిర్ణయం? :

దూకుడు బ్యాటింగ్ శైలికి పేరుగాంచిన 46 ఏళ్ల సెహ్వాగ్, ఆర్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఆర్యవీర్ 2007 సంవత్సరంలో జన్మించాడు. చిన్న కుమారుడు వేదాంత్ 2010లో జన్మించాడు. గత సంవత్సరం దీపావళి నాడు, సెహ్వాగ్ తన ఇద్దరు పిల్లలు, తల్లితో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కానీ, ఆర్తి గురించి ప్రస్తావించలేదు. నివేదికల ప్రకారం.. సెహ్వాగ్, ఆర్తీ అహ్లావత్ మధ్య కొంతకాలంగా అభిప్రాయభేదాలతో దూరం పెరిగింది. ఈ కారణంగా వారు విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Advertisement
PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

2004లో సెహ్వాగ్-ఆర్తిల వివాహం :
2004 ఏప్రిల్‌లో భారీ భద్రత మధ్య ఆర్తీ అహ్లావత్‌ను సెహ్వాగ్ వివాహం చేసుకున్నాడు. వివాహ వేడుకను బీజేపీ మాజీ నేత దివంగత అరుణ్ జైట్లీ తన నివాసంలో నిర్వహించారు. సెహ్వాగ్ తన యుగంలో అత్యుత్తమ దూకుడు బ్యాట్స్‌మెన్‌గా పేరొందాడు. సెహ్వాగ్ తొలిసారిగా 1999లో భారత్ తరఫున తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. 2001లో భారత టెస్టు జట్టులో చేరాడు.

భారత వైస్ కెప్టెన్‌గా సెహ్వాగ్ :
భారత ప్రధాన కెప్టెన్ లేకపోవడంతో స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా, అలాగే భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా సెహ్వాగ్ పనిచేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్) తరపున ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ, హర్యానా జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2002లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఉమ్మడి విజేతగా నిలిచిన భారత జట్టుతో పాటు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సెహ్వాగ్ కూడా ఉన్నాడు.

2023లో చివరి పోస్ట్ ఇదే :
వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి కోసం సోషల్ మీడియాలో చేసిన చివరి పోస్ట్ 2023లో మాత్రమే. ఏప్రిల్ 28, 2023న, అతడు దుబాయ్ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో అతను క్యాప్షన్‌లో రాశాడు.. సమ్‌వేర్‌ బై లివింగ్ అండ్ డ్రీమింగ్. దీనితో పాటు, హ్యాష్‌ట్యాగ్‌లో హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్‌ని జోడించాడు. ఈ పోస్ట్ చేసి దాదాపు 21 నెలలైంది. ఈ సమయంలో, సెహ్వాగ్ గత సంవత్సరం తన వార్షికోత్సవంలో కూడా పోస్ట్ చేయలేదు.

Advertisement
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

అంతకు ముందు, వీరేంద్ర సెహ్వాగ్ తన భార్యతో రెగ్యులర్ వ్యవధిలో ఫోటోలను పంచుకునేవాడు. ప్రస్తుతం సెహ్వాగ్ కుమారులిద్దరూ ఢిల్లీ తరఫున ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడుతున్నారు. కొంతకాలం క్రితం కూచ్ విహార్ ట్రోఫీలో ఆర్యవీర్ డబుల్ సెంచరీ సాధించాడు. అతను 297 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

ఆర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో సెహ్వాగ్ :
వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఆర్తి పేరులోనే సెహ్వాగ్ అని రాసి ఉంది. వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తీ చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. సెహ్వాగ్ కుటుంబంలో ఆర్తి అత్త వివాహం జరిగింది. 17 ఏళ్ల పరిచయం తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మొదట్లో వీరూ కుటుంబం పెళ్లికి సిద్ధంగా లేదు. అయితే అతడి మొండివైఖరికి కుటుంబం కూడా వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read Also : Karnataka Man : బెంగళూరులో మరో ‘అతుల్ సుభాష్’ ఆత్మహత్య.. భార్య ఎదుటే ప్రాణాలు విడిచాడు..!

Advertisement
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Exit mobile version