Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Woman Hit Zomato Boy : జొమాటో డెలివరీ బాయ్ ను చెప్పుతో కొట్టిన యువతి, ఎందుకంటే?

Woman Hit Zomato Boy : గత కొంత కాలం క్రితం ఓ యువతి ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి చేసి, డెలివరీ బాయే తనను కొట్టాడని కల్లబొల్లి మాటలు చెప్పిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను జైలుకు కూడా పంపారు. అయితే అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. ఓ యువతి జొమాటో డెలివరీ బాయ్ ను పట్టుకుని బూతులు తిట్టింది. అక్కడితో ఆగకుండా చెప్పుతో కొట్టింది. పక్కనే మరో ముగ్గురు వ్యక్తులతో కూడా గొడవకు దిగింది. అయితే ఆమె ఇష్టారీతిగా బూతులు తిడుతూ, కొట్టినా, ఆ డెలివరీ బాయ్ ఏమీ అనకుండా అలాగే ఉండిపోయాడు.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

అంతే కాదండోయ్ వేరే వాళ్ల కోసం తీసుకొచ్చిన ఫుడ్ కూడా లాగేస్కుంది. ఆ ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ పార్ట్ నర్ పైనే దాడి చేసింది. ప్రస్తుతం అఇందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు ఓ వ్యక్తి. తన ఆర్డర్ తీసుకువస్తుండగా.. ఓ యువతి ఆర్డర్ తీసుకోవడమే కాకుండా జొమాటో బాయ్ ను కొట్టిందని పోస్టు చేశాడు. అసలు ఫుడ్ తీసుకున్న ఆ యువతికి, ఆర్డర్ చేసిన వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఈ ఘటనపై జొమాటోకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోవడంలేదని చెప్పాడు. ఎట్టకేలకు స్పందించిన జొమాటో సంస్థ… ఈ ఘటనలో నిజానిజాలు తెలుసుకుంటామని హామీ ఇచ్చింది.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version