Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Vijayasanthi : సీఎం కేసీఆర్​పై ఫైర్ అయిన రాములమ్మ..!

Vijayshanti fires

Vijayshanti fires

Vijayasanthi : సినీనటి, బీజేపీ నేత అయిన విజయశాంతి…సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఆ పరమ శివుడు నీపై మూడు కన్ను తెలుస్తాడు అని అన్నారు. నీ ఆగడాలని చూస్తూ ఊరుకోడని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని వేములవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె దీక్ష చేపట్టారు . ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి పై నిప్పులు చెరిగారు. రాజన్న ఆలయానికి ఒక సంవత్సరానికి సుమారు వంద కోట్ల రూపాయిలు పైగా ఇస్తాను అని నాడు సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఒక్క ప్రకటన కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్​ మాటమీద నిలబడే మనిషి కాదని అన్నారు. అలాంటి వ్యక్తే అయితే వెంటనే రూ. 700 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

అయితే ఇచ్చిన హామీలను నిరవేర్చని కేసీఆర్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. అంతేగాకుండా ఆయనకు సంస్కారం లేదని విమర్శించారు. దేవుడి విషయంలో కూడా అబద్దాలు ఆడిన వ్యక్తి కేసీఆర్​ ఆని దుయ్యబట్టారు. ఇందుకు గానూ ఆయనను మీరు అని సంబోధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అందుకే నువ్వు అని పిలుస్తాను అని విజయశాంతి అన్నారు. రాజన్న గుడికి వచ్చే భక్తులకు సరైన సదుపాయాలు లేవని అన్నారు. అందులోనూ గుడి చాలా చిన్నదిగా ఉందని తెలిపారు. చిన్న పిల్లలు ముసలి వాళ్లు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అభివృద్ధి చేయండి అని అడిగితే కేసీఆర్​ అడిగిన వారిని అరెస్టుల పేరుతో హింసిస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే మాట్లాడిన విజయశాంతి వేములవాడ నుంచి పోటీ చేసిన ఎమ్యెల్యేను గెలిపించినా కానీ అభివృద్ధి చేయడం లేదని అన్నారు. జిల్లా నుంచి మంత్రి ఉన్నా సరే లాభం లేకుండా పోయిందిని దుయ్యబట్టారు. హిందుగాళ్లు బొందుగాళ్లు అని కేసీఆర్‌ చేసిని వ్యాఖ్యలను గుర్తు చేసిన రాములమ్మ… నువ్వు హిందువువా లేక ముస్లిం వా అనే విషయాన్ని తెలియజేయాలని అన్నారు. అంతేగాకుండా తాను చేసిన తప్పలను ముఖ్యమంత్రి మోడీ పై వేస్తున్నట్లు తెలిపారు. రామాలయానికి మోదీ డబ్బులు వసూలు చేయడం కూడా తప్పా అని విమర్శించారు.

Advertisement

Read Also : Singer Parvathi : ఆ ఊరికి బస్సు రావడానికి స్మితా, నేనే కారణం.. ఆ మంత్రుల సాయం మరువలేనిది

Exit mobile version