Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Two Men Marriage : తాళికట్టు శుభవేళ.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న అబ్బాయిలు.. వీడియో వైరల్..!

two-men-marriage-video-goes-to-viral

two-men-marriage-video-goes-to-viral

Two Men Marriage : ప్రేమ అనే పదానికి చాలా శక్తి ఉంటుంది. అది ఎప్పుడు, ఎలా, ఎక్కడ పుడ్తుందో కూడా తెలియదు. అయితే మనం ఈ ప్రేమను ఒక యువతి, యువకుడి మధ్యే చూస్తుంటాం. ప్రేమికులు అనగానే మన మదిలోకి వచ్చేది కూడా అమ్మాయి, అబ్బాయే. అయితే వారి ప్రేమను గెలిపించుకునేందుకు కుటుంబాలతో పెద్ద యుద్ధమే చేస్తారు. వారు అంగీకరిస్తే.. ఆనందంతో పెళ్లి చేసుకొని బతికి ఉన్నంత కాలం వారితో గడుపుతారు. ఒక వేళ వారు కాదంటే మాత్రం ఆత్మహత్య చేసుకోవడం, వేరొకరిని పెళ్లి చేసుకొని వెళ్లిపోవడం కూడా చూస్తుంటాం. కానీ మనం చూడబోయే ఓ జంట మాత్రం తమ పెళ్లి కోసం పెద్ద యుద్ధమే చేశారు.

Two men marriage

ఎట్టకేలకు వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే ఇందులో ఆశ్చర్యోపోవాల్సిన విషయం ఏముంది అనుకుంటున్నారా.. ఇక్కడ పెళ్లి చేసుకుంది ఓ అమ్మాయి, అబ్బాయి కాదండీ.. ఇద్దరు అబ్బాయిలు. ఏటీ అనుకుంటున్నారా.. అవునండీ ఇదే నిజం ఇద్దరు అబ్బాయిలు ఒకరిని ఒఖరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లని ఒప్పించుకొని మరీ ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వారి తల్లిదండ్రులు ఎంతో ఉన్నతంగా ఆలోచించి వీరికి పెళ్లికి ఒప్పుకోవడం గమనార్హం.

Advertisement

Read Also : Baby Viral Dance : అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్‌తో.. సామ్ సాంగ్‌కు చిన్నారి డ్యాన్స్!

Exit mobile version