Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. !

Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అందులోనూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి కారణంగా మధ్య ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ వరకు దీని ప్రభావం ఉంటుంది. ఛత్తీస్​గఢ్​ నుంచి కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Weather Report

దాదాపు నెల రోజులుగా భారీ ఎండలతో మండిపోతున్న ప్రజలు… గత మూడ్రోజుల నుంచి కాస్త చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. మొన్నటి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా కురిసిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. కానీ పంట చేతికొచ్చే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిస్తే.. పంటంతా నాశనం అయ్యే అవకాశం ఉందిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో వానలు ఏంటా అని వాపోతున్నారు.

Read Also : Pudeena Juice : రోగ నిరోధక శక్తిని పెంచే పుదీనా షర్బత్.. చల్లగా తాగి చిల్ అవ్వండి!

Advertisement
Exit mobile version