Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Telugu TV Serials Rating: దారుణంగా పడిపోయిన తెలుగు టీవీ సీరియల్స్ రేటింగ్.. మొదటి స్థానాన్ని ఆక్రమించిన ఆ సీరియల్?

Telugu TV Serials Rating: తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కో సీరియల్ మరొక సీరియల్ కిగట్టి పోటీ ఇస్తూ ప్రసారమయ్యేవి. అయితే గత కొంత కాలం నుంచి ఈటీవీ సీరియల్స్ రేటింగ్ అమాంతం పడిపోయాయని తెలుస్తోంది. ఏకంగా సగానికి సగం రేటింగ్స్ పడిపోయాయి.డాక్టర్ బాబు వంటలక్క ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం కార్తీకదీపం సీరియల్ ఒకనొక సమయంలో ఏకంగా 21.07 శాతం రేటింగ్ సంపాదించుకుంది. ఇండియాలోనే నెంబర్ వన్ టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకున్న సీరియల్ గా కార్తీకదీపం నిలబడింది.

ఇకపోతే ఈ సీరియల్ ప్రస్తుతం సగానికి సగం రేటింగ్ పడిపోయిందని చెప్పాలి. ఇందుకు కారణం ఇందులో ప్రధానంగా నిలిచినటువంటి డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలను తొలగించడమే. ఇకపోతే తాజాగా బార్క్ రేటింగ్ మే 28 నుంచి జూన్ 3 వరకు ఈ సీరియల్ కేవలం 9.86 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది.9.73 రేటింగ్ తో కార్తీకదీపం తరువాత దేవత సీరియల్ రెండవ స్థానంలో నిలబడింది. ఇకపోతే కార్తీకదీపం సీరియల్ కు గట్టి పోటీగా ఉన్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మూడవ స్థానానికి వెళ్ళింది.

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఏకంగా 9.39 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. ఇకపోతే ఫ్యామిలీ ఎమోషన్ తో ఎంతగానో ఆకట్టుకున్న గుప్పెడంత మనసు సీరియల్;9.08 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది. జానకి కలగనలేదు 6.61 పాయింట్లతో ఐదవ స్థానంలో నిలబడింది. ఇకపోతే 6.53 పాయింట్లతో తర్వాత స్థానంలో ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ రేటింగ్ సొంతం చేసుకుంది.ఈ విధంగా టీవీ సీరియల్స్ రేటింగ్ అమాంతం తగ్గి పోయినప్పటికీ కార్తీకదీపం సీరియల్ ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం.

Advertisement
Exit mobile version