G
Telugu News » Latest » the application process for telangana group 1 posts has started how to apply
⚡ Latest

TSPSC Group-1: తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు ప్రారంభమైన ధరఖాస్తు ప్రక్రియ… దరఖాస్తు ఎలా చేయాలంటే?

TSPSC Group-1తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియలను ప్రారంభించారు.

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

TSPSC Group-1: తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియలను ప్రారంభించారు. 18 శాఖలలో 501 గ్రూప్ వన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఈ ఉద్యోగాల కోసం ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండగా ఇప్పటికే అధికారులు ఓటీఆర్‌లో మార్పులు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఉద్యోగులు వారి పై అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు.

మరి ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి వస్తే…

Advertisement

అభ్యర్థులు ముందుగా సంబంధిత https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ చేయాలి. హోం పేజ్ కుడివైపున వన్ టైం రిజిస్ట్రేషన్ బటన్ పై క్లిక్ చేయగా, కొత్త పేజీ ఓపెన్ అయి ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు నెంబర్ తో పాటు ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు ఎంటర్ చేయాలి.

Personal Details సెక్షన్‌లో ఎస్ఎస్‌సీ లేదా తత్సమాన సర్టిఫికెట్‌లో ఉన్నట్టుగా అన్ని వివరాలను నమోదు చేయాలి. అడ్రస్ సెక్షన్లో మీ చిరునామా, ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి.

ఒకటవ తరగతి నుంచి మీరుచదివిన చదువుకు సంబంధించిన అన్ని వివరాలను కూడా నమోదు చేసి సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి.

Additional Qualifications సెక్షన్‌లో అదనపు అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి. ఫోటో సంతకం అప్‌లోడ్ చేయాలి.ఆ తర్వాత ప్రివ్యు క్లిక్ చేసి మన వివరాలు అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఏవైనా తప్పులు ఉంటే తిరిగి సరి చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే TSPSC ID జనరేట్ అవుతుంది. టీఎస్‌పీఎస్‌సీ ఏ జాబ్ నోటిఫికేషన్  విడుదల చేసినా TSPSC ID ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷examsjobsnotificationTelanganaTSPSC Group-1
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు