Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Big boss winner : బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బింధుమాదవి.. అఖిల్ స్థానమేంటి?

Big boss winner : బిగ్ బాస్ ఓటీటీ వర్షన్, బిగ్ బాస్ నాన్ స్టాప్ కి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఫైనర్ ఎపిసోడ్ కోసం పూర్తిగా రంగం సిద్ధం అయింది. అయితే ఈ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచినట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ అయిన అఖిల్ సార్క్ ఓటీటీ వర్షన్ లో కూడా అదే స్థానానికి పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తెలుగులో బిగ్ బాస్ విజేతగా మహిళలు ఎవరూ నిలవలేదు. తొలి మహిళా విజేతగా బిందు మాధవి చరిత్ర సృష్టించింది.

Big boss winner

అయితే గతంలో వరుసగా శివ బాలాజీ, కౌశర్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్, సన్నీ లు బిగ్ బాస్ విజేతలుగా నిలిచారు. గీతా మాధురి, యాంకర్ శ్రీముఖి మాత్రమే రెండు మూడు సీజన్లలో సెంకడ్ ప్లేస్ లో నిలిచారు. ఇక ఈ ఓటీటీ వెర్షన్ లో శివ మూడువ స్థానంలో, అరియానా గ్లోరీ నాలుగో స్థానంలో, మిత్రా ఐదో స్థానంలో, బాబా భాస్కర్ ఆరో స్థానంలో, అనిల్ రాథోడ్ ఏడో స్థానంలో నిలిచారు. అయితే ఈ బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ అట్టర్ ప్లాప్ అనిపించుకుంది. ఏందుకో ఏమో కానీ దీనికి ప్రేక్షకాదరణ దక్కలేదు. మరి నిర్వాహకులు ఓటీటీ సెకండ్ సీజన్ నిర్వహిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Read Also : Big Boss Non Stop Winner: బిగ్ బాస్ విన్నర్ గా బిందుమాధవి.. బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఇలా?

Advertisement
Exit mobile version