Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Telangana Rains : మంథనిలో బాహుబలి శివగామి సీన్ రిపీట్.. తలపై తొట్టెలో పసిబిడ్డ.. వీడియో వైరల్!

Telangana Rains : జక్కన్న రాజ‌మౌళి రూపొందించిన ‘బాహుబ‌లి-1’ మూవీలో సీన్ రిపీట్ అయింది. బాహుబ‌లిని కాపాడేందుకు శివ‌గామి (రమ్యకృష్ణ‌) పెద్ద నదిని దాటుతుంది. ఆ సమయంలో తన కుడి చేతితో పసిబిడ్డ బాహుబలిని పైకి ఎత్తి.. న‌దిలో దాటుతుంది. తాను మునిగిపోతుంది. ఆ సీన్ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఎందుకంటే అంతగా ఆ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటి సీన్ రిపీట్ అయింది. తెలంగాణ కొద్దిరోజులుగా భారీ వ‌ర్షాలు పడుతున్నాయి. బయటకు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లో వరదనీరుతో జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి.

Telangana Rains _ Bahubali Water Scene Repeats in Manthani, a man carries 2 months of old boy in basket in flood, Video Goes Viral

పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని మంథ‌నిలో బాహుబలి సీన్ మాదిరి ఘటన జరిగింది. వరదలతో ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. భుజాల లోతు వరదనీటితో నిండిపోయాయి. ఆ ప్రాంతంలో మూడు నెల‌ల శిశువును కాపాడేందుకు కుటుంబ స‌భ్యులు పడిన కష్టం మామూలుగా లేదు.. ఆ పసిబిడ్డను ఓ బుట్ట‌లో ఉంచి, త‌ల‌పై పెట్టుకుని మరి తీసుకెళ్లారు. వరదనీరు కారణంగా ఒక ఇంట్లోని కుటుంబసభ్యులంతా డాబాపైకి ఎక్కారు. వారిలో రెండు నెలల బాబు ఉన్నాడు. సుమలత అనే బాలింత ఉంది.

Telangana Rains : తెలంగాణలో బాహుబలి వాటర్ సీన్ రిపీట్.. వరదనీటిలో తొట్టెలో పసిబిడ్డ.. వీడియో వైరల్!

వరదనీటిలో చిక్కుకున్న తల్లీబిడ్డను కాపాడేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. భుజాల వరకు ఉన్న వరదల్లో నడిచేందుకు బాలింత సుమలత ఇబ్బంది పడింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆమె అక్క కొడుకు రంజిత్ సుమలతను గట్టిగా పట్టుకుని సురక్షితంగా వరద నీటిని దాటించి ఒడ్డుకు చేర్చాడు. మరి పసిబిడ్డను ఎత్తుకుని వెళ్లేందుకు వీలు లేదు.

Advertisement


ఆ బాబు వాళ్ల పెద్దనాన్న రామ్మూర్తి.. పసివాడిని సురక్షితంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగానే ఇంట్లోని ఒక పెద్ద బుట్టలో పసికందును పడుకోబెట్టాడు. పసివాడికి చలి లేకుండా వెచ్చగా ఉండేందుకు ఆ బుట్టలో దుస్తులు పెట్టాడు. ఇక ఆ తొట్టెను బాహుబలి మూవీలోని శివగామి సీన్ మాదిరిగా రెండు చేతులతో పైకెత్తి పట్టుకుని జాగ్రత్తగా వరదనీటిలో నడుస్తూ ఒడ్డుకు తీసుకెళ్లాడు. బాహుబలి మూవీని తలపించిన ఈ దృశ్యాలను అక్కడి వారు తమ ఫోన్లలో వీడియో రికార్డు తీయగా.. ఇప్పుడా ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Read Also : Samantha: సమంతకు ఎవరూ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు.. ‘యశోద’ డెైరెక్టర్స్ కామెంట్స్

Exit mobile version